పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 11
బాలికల ఎదుగుదలకు, రక్షణకు బాలిక విద్యకు అందరూ తోడ్పాటు నందించాలని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వ విద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు,శనివారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా హన్మకొండ కలెక్టరేట్ దగ్గర లోని ప్రభుత్వ బాలికల బాలసదనం హాస్టల్ సందర్శించి పిల్లలకు ఆత్మీయ స్పర్శనందించి అనంతరం డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్ల లేనిదే సృష్టి లేదని, ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అని నేటి ప్రంపంచంలో ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నరని వారి అభ్యున్నతికి తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా ప్రోత్సాహం అందించాలని అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదగాలని వారు వినడం నుండి మాట్లాడి, చర్చించి తన ఆలోచనలను ఆచరణలో పెట్టే స్తాయికి, తమ హక్కులను తమ అభివృద్ధికి ఉపయోగించుకునే స్తాయికి చేరాలని అన్నారు, 1) జువెనల్ జస్టిస్ ఆక్ట్ (JJ Act), 2) గుడ్ టచ్ బ్యాడ్ టచ్, 3) పౌష్టికాహార విలువలు, విద్యా విలువలు,గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ తదితర అంశాలపై పిల్లలకు డాక్టర్ అనితా రెడ్డి అవగాహన కల్పించారు సమాజంలోని ఆదరణ, నిరాదరణకు గురైన బాలికలను చేరదీసి వారికి విద్యా బుద్ధులు నేర్పించుటలో, రక్షణ, ధైర్యము కల్పించడంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని బాలికల అభివృద్ధికి విద్యా చాలా దోహదం చేస్తుందని, నిరుపేదలైన తల్లి తండ్రు లు బాలికల రక్షణ సంరక్షణ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వినియోగించు కోవాలని ప్రతి తల్లి తండ్రి బాలికలకు బాల్యవివాహాలు చేయకుండా బాల కార్మికులుగా మార్చకుండా వారిని సరైన దిశా నిర్దేశం చేయాలని అన్నారు. బాలల రక్షణ సంరక్షణ కోసం గ్రామ మండల జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టుతున్నామని బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బాలికలకు అందమైన బాల్యాన్ని బహుమతిగా అందించాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, బాలికలు తమ ఆలోచనలను పంచుకొని ఆచరణలో పెట్టుకొనే స్థానంలో ఉన్నప్పుడే నిజమైన బాలికల దినోత్సవం అని అనితా రెడ్డి అన్నారు, అనంతరం పిల్లలతో బాల్యవివాహాలు చేసుకోమని, బాల కార్మికులుగా మారమని, చక్కగా చదువుకుంటామని, తమ హక్కుల రక్షణ కోసం తామే పాటుపడతామని ప్రతిఙ్ఙ చేయించారు,, డాక్టర్ అనితా రెడ్డి, సిబ్బంది, పిల్లలు, పాల్గొన్నారు




