Thursday, October 22, 2026
Home Politics —సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి– —వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు– ...

—సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి– —వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు–  –ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ–

0
20

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని, ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్  ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోచమ్మ మైదాన్ సర్కిల్ నుంచి కాశీబుగ్గ అంబేద్కర్ జంక్షన్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.వరంగల్ డీసీసీ అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి , పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జాన్సీ రెడ్డి , కూడా చైర్మెన్ గుండు సుధారాణి గార్లతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పాల్గొన్నారు. ఈ ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత పవిత్రమైనదని, ప్రజల ఓటు హక్కుకు భంగం కలిగించే ఏ చర్యనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పారదర్శకంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని, ఆ విశ్వాసానికి భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికి దేశ ప్రజల మద్దతు ఉందని, ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐక్యంగా ఉద్యమిస్తారని తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని, అవసరమైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ యూత్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా,నియోజకవర్గ,మండల,డివిజన్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.