Thursday, October 22, 2026
Home Politics సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య…

సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య…

0
19

📰 Generate e-Paper Clip

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 

సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ మన రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతుందని ఎంపీ పేర్కొన్నారు.తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడబిడ్డలు ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.సద్దుల బతుకమ్మ ప్రతి ఇంటా సంతోషాల సిరులు కురిపించాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని, తెలంగాణ సంస్కృతి వైభవం కలకాలం పరిఢవిల్లాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.