Thursday, October 22, 2026
Home Politics విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, హన్మకొండ   కలెక్టర్….

విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, హన్మకొండ   కలెక్టర్….

0
21

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 5

హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ విజయ డైరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను సోమవారం హనుమకొండ జిల్లాలో ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి గారు, హనుమకొండ జిల్లా కలెక్టర్  చాహత్ బాజ్‌పేయి  ముఖ్య అతిథులుగా హాజరై ఈ కేంద్రాలను ప్రారంభించారు.హనుమకొండ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో, అలాగే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తుల కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను వారు పరిశీలించారు.ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడంలో విజయ డైరీ కీలక పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ప్రజలకు, ముఖ్యంగా బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి సహాయకులు, సిబ్బందికి విజయ డైరీ ఉత్పత్తులు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయడంతో పాటు, వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రదేశాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా విజయ డైరీ ఉత్పత్తులకు మరింత ఆదరణ లభించే అవకాశం ఉందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి మాట్లాడుతూ… ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా విజయ డైరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఇటువంటి కేంద్రాల ఏర్పాటు ద్వారా నాణ్యమైన పాల ఉత్పత్తులను సులభంగా పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి విజయ డైరీ సిబ్బందితో మాట్లాడి కేంద్రంలో అందుబాటులో ఉన్న పాల ఉత్పత్తులు, వాటి విక్రయ విధానం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందేలా అవసరమైన ప్రమాణాలను పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఈవి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు వేముల శ్రీనివాస్, నాయకులు తోట పవన్, నలుబోల సతీష్, విజయ డైరీ DD ధనరాజ్.అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.