Thursday, October 22, 2026
Home Politics మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్‌ కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే KR నాగరాజు …

మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్‌ కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే KR నాగరాజు …

0
20

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 5 …

హన్మకొండకు చెందిన మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్ ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడి మృతి చెందడం తీవ్ర విషాదకరమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు. కానుగంటి శేఖర్ మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కానుగంటి శేఖర్  అకాల మరణం ఎంతో బాధాకరమని, ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. శేఖర్ కుటుంబానికి ఈ విషాద సమయంలో తనతో పాటు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. వారితో పాటు వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.