Thursday, October 22, 2026
Home Politics వరంగల్ తూర్పు నియోజకవర్గం లొ బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు సన్నాహక...

వరంగల్ తూర్పు నియోజకవర్గం లొ బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు సన్నాహక సదస్సు…

0
34

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 04

నివారం వరంగల్‌లోని రాజశ్రీ గార్డెన్స్‌లో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు  నన్నపునేని నరేందర్ , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  ఏనుగుల రాకేష్ రెడ్డి  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

–ఏనుగుల రాకేష్ రెడ్డి  మాట్లాడుతూ…

2024లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో ఎన్రోల్మెంట్‌తో పాటు పోలింగ్ ప్రక్రియలో తన వెంట ఉండి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం కూడా 2023 నవంబర్ నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్ లేదా ఇతర అర్హత కలిగిన కోర్సులు పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఎన్రోల్మెంట్ ప్రక్రియపై అవగాహన కల్పించి, అధికారిక ప్రక్రియను పూర్తి చేసుకునేలా సహకరించాలని కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న అర్హులైన పట్టభద్రులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నన్నపునేని నరేందర్  కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

–నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నియోజకవర్గంలో పటిష్టమైన సమన్వయంతో ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.– ప్రతి కార్యకర్త బాధ్యతతో ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలి .– ప్రతి డివిజన్‌కు ఒక ఇన్‌చార్జిని నియమించాము– ప్రతి 100 మంది పట్టభద్రులకు ఒక ఇన్‌చార్జిని కేటాయించడం జరిగింది– ప్రతి డివిజన్‌లో ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి.– అర్హులైన పట్టభద్రులు అధికారిక నమోదు ప్రక్రియను పూర్తి చేసుకునేలా డివిజన్లో హెల్ప్ డెస్క్ ధర ప్రక్రియను పూర్తి చేయాలి
–– ప్రతి కార్యకర్త తన పరిధిలోని పట్టభద్రులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలి.–– ఎవరి బాధ్యత వారే పూర్తి చేసేలా బాధ్యతలను స్పష్టంగా విభజించాము–– ప్రతిరోజూ జరిగిన పని, ఇంకా పూర్తి చేయాల్సిన పనిపై సమీక్ష నిర్వహిస్తాము–ఏమైనా ఎన్రోల్మెంట్‌లో ఎదురయ్యే సమస్యలను వెంటనే నియోజకవర్గ స్థాయి సమన్వయ బృందం దృష్టికి తీసుకురావాలి.–– చివరి తేదీ వరకు వేచి ఉండకుండా మేము ఇచ్చిన ప్రాణాలిక ప్రకారం ముందుగానే ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలి.– సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాతే షేర్ చేయాలి.– అవసరమైన చోట అదనపు కార్యకర్తలను, టీమ్‌లను ఏర్పాటు చేసి పని వేగవంతం చేయాలి.– మొత్తం నియోజకవర్గంలో ఒకే విధమైన కార్యాచరణ, సమన్వయంతో ముందుకు సాగాలి.“ప్రతి కార్యకర్త ఒక బాధ్యత తీసుకోవాలి – ప్రతి బాధ్యతను పూర్తి చేయాలి” అనే విధానంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఎన్రోల్మెంట్ పూర్తయ్యే వరకు ప్రతి స్థాయిలో ఫాలోఅప్ కొనసాగించాలని, నియోజకవర్గం → డివిజన్ → 100 మంది పట్టభద్రులకు ఒక ఇన్‌చార్జి → వ్యక్తిగత ఫాలోఅప్ విధానంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.ఎన్రోల్మెంట్‌కు చివరి తేదీ నవంబర్ 6 అయినప్పటికీ, అక్టోబర్ 25లోపు ప్రతి అర్హులైన పట్టభద్రుడి ఎన్రోల్మెంట్ పూర్తి చేసి, డివిజన్ వారీగా వారి వివరాలను పార్టీ కార్యాలయంలో అందజేయాలని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.