Thursday, October 22, 2026
Home Politics రామచంద్రపురంలో 250 మెట్రిక్ టన్నుల గోడౌన్ జిల్లా కలెక్టర్ తో ప్రారంభం… –తీగరాజుపల్లిలో రూ.30 లక్షలతో...

రామచంద్రపురంలో 250 మెట్రిక్ టన్నుల గోడౌన్ జిల్లా కలెక్టర్ తో ప్రారంభం… –తీగరాజుపల్లిలో రూ.30 లక్షలతో ఫుడ్‌ గ్రెయిన్‌ స్టోరేజ్‌ గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

0
34

📰 Generate e-Paper Clip

వరంగల్ జిల్లా అక్టోబర్ 03 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక…సంగెం మండలంలో సహకార సంఘాలు, మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా శనివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రామచంద్రపురం గ్రామంలో ఎఫ్‌ఎస్‌సీఎస్‌ కాపులకనపర్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన 250 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్‌ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. సొసైటీ పాలక మండలి సభ్యులు చక్కగా పనిచేస్తున్నారని అభినందించారు. సొసైటీ ద్వారా సభ్యులకు అందుబాటులో ఉన్న వివిధ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సహకార సంఘాల ద్వారా సభ్యుల ఆర్థిక అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని కోరారు.మహిళలకు ఉపాధి, అదనపు ఆదాయ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో పాల ఉత్పత్తి, పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు, సొసైటీ సభ్యులు ఈ సదుపాయాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జిల్లాలో సహకార రంగం అభివృద్ధికి, వివిధ కార్యక్రమాల అమలుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అందిస్తున్న సహకారం, ప్రోత్సాహాన్ని ఎమ్మెల్యే అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ…. సహకార సంఘాల ద్వారా రైతులకు, సభ్యులకు అందుతున్న సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతనంగా నిర్మించిన గోడౌన్‌ను రైతులు, సొసైటీ సభ్యులు సద్వినియోగం చేసుకుని తమ వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరుచుకోవాలని సూచించారు. సహకార సంఘాల బలోపేతానికి పాలక మండలి సభ్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.అనంతరం సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో SERP, DRDA, మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో VB-G RAM G గ్రాంట్ ద్వారా రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫుడ్‌ గ్రెయిన్‌ స్టోరేజ్‌ గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా సహకార అధికారి నీరజ (DCO), జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్ (DAO),
సంగెం తహసిల్దార్ రాజకుమార్, మండల అభివృద్ధి అధికారి రమేష్ (MPDO), SERP, DRDA అధికారులు, మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, సొసైటీ పాలక మండలి సభ్యులు, సిబ్బంది, రైతులు, సొసైటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.