రామచంద్రపురంలో 250 మెట్రిక్ టన్నుల గోడౌన్ జిల్లా కలెక్టర్ తో ప్రారంభం… –తీగరాజుపల్లిలో రూ.30 లక్షలతో ఫుడ్‌ గ్రెయిన్‌ స్టోరేజ్‌ గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

వరంగల్ జిల్లా అక్టోబర్ 03 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక...సంగెం మండలంలో సహకార సంఘాలు, మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా శనివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రామచంద్రపురం గ్రామంలో ఎఫ్‌ఎస్‌సీఎస్‌ కాపులకనపర్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన 250 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్‌ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. సొసైటీ పాలక మండలి సభ్యులు...