పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 6
ఒకవైపు అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిస్తూ.. మరోవైపు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 14వ డివిజన్ బాలాజీనగర్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి–షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని లబ్ధిదారులకు కార్డులు, చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే నాగరాజు కి స్థానిక మహిళలు బతుకమ్మలతో, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు.ప్రభుత్వ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
-ఎన్టీఆర్ నగర్లో అభివృద్ధికి శ్రీకారం....
బాలాజీనగర్ కార్యక్రమం అనంతరం ఎన్టీఆర్ నగర్లో రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులు చేపడుతున్నామని తెలిపారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, చేపట్టిన పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి అయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. సంక్షేమం ప్రతి ఇంటికి.. అభివృద్ధి ప్రతి వీధికి అనే లక్ష్యంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, మాజీ కార్పొరేటర్ సులోచన సారయ్య,ఎస్సీ సెల్ చైర్మెన్ సిలువేరు శ్రీనివాస్,ఆరేపల్లి మాజీ పాక్స్ చైర్మన్ బుద్దే పెద్దన్న,సీనియర్ నాయకులు జానీ,శంకర్,రాజేష్, శివపటేల్,స్టాలిన్,పైసా మహేష్,పిట్ట సుధీర్,సయ్యజి,కడప నాగలక్ష్మి, డివిజన్ ముఖ్య నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




