–బాలాజీనగర్‌కు సంక్షేమం.. ఎన్టీఆర్ నగర్‌కు అభివృద్ధి!— –స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి–షాదీముబారక్ చెక్కుల పంపిణీ.. –ఎన్టీఆర్ నగర్‌లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 6 ఒకవైపు అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిస్తూ.. మరోవైపు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 14వ డివిజన్ బాలాజీనగర్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి–షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  పాల్గొని లబ్ధిదారులకు కార్డులు, చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే నాగరాజు  కి...