Thursday, October 22, 2026
Home Politics –గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టాలి: వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ..

–గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టాలి: వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ..

0
25

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02

మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొత్తవాడ, కాశీబుగ్గ, స్టేషన్ రోడ్, పుప్పాలగుట్ట, రంగశాయిపేట ప్రాంతాల్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలకు ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య, KUDA చైర్మన్  గుండు సుధారాణి, మేర కార్పొరేషన్ చైర్మన్  సంఘ వెంకటరాజ్యం  తో కలిసి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మహమ్మద్ అయూబ్   పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ…మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి, సామరస్యాన్ని ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని మహమ్మద్ అయూబ్ పేర్కొన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు.గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని, సమాజంలో శాంతి, సోదరభావం, సామాజిక సమానత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన, సమానత్వం మరియు సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని మహమ్మద్ అయూబ్ కోరారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నల్గొండ రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా, మండల, డివిజన్, స్థాయి నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.