Thursday, October 22, 2026
Home Politics –ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా నాణ్యమైన విద్య…–నాణ్యతలో రాజీ లేకుండా పనులు చేపట్టాలి: వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే...

–ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా నాణ్యమైన విద్య…–నాణ్యతలో రాజీ లేకుండా పనులు చేపట్టాలి: వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..

0
23

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08

వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్‌ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  గురువారం పరిశీలించారు. సుమారు 16 ఎకరాల 11గుంటల విస్తీర్ణంలో 200కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్న పాఠశాల ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే KR నాగరాజు  అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి భూమిని కేటాయించారు.ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక, భవన నిర్మాణ పనులు, మౌలిక వసతులు, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులను ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నిర్ణీత ప్రణాళిక ప్రకారం వేగవంతంగా కొనసాగించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పాఠశాల నిర్మాణాన్ని చేపట్టాలని ఎమ్మెల్యే  అధికారులకు సూచించారు.ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యా వసతులు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  తెలిపారు. నిర్మాణంలో ఎక్కడా నాణ్యతా లోపాలు లేకుండా, నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చోట అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే, నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలోని విద్యార్థులకు ఆధునిక విద్యా వసతులు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.