Thursday, October 22, 2026
Home Politics –ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్యకూటమిని గెలిపించాలి –కార్మిక సభలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…

–ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్యకూటమిని గెలిపించాలి –కార్మిక సభలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…

0
15

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 6.. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు యూనియన్ల ద్వారానే సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీలో మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో సకల జనుల సమ్మె సమయంలో కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులు, జీతాల ఆలస్యం, బస్సుల్లోనే రోజుల తరబడి కూర్చుని నిరసనలు తెలిపిన పరిస్థితులను గుర్తు చేశారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నాయకులు ఇప్పటికే వివరంగా మాట్లాడారని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యలను పదేపదే ప్రస్తావిస్తూ సమయం వృథా చేయకుండా, కార్మికుల సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.తాను గతంలో ఒక ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడిగా పనిచేశానని, కార్మిక సంఘాల సమస్యలు తనకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి పనిచేసే వ్యక్తిగా, పార్టీ నిర్ణయం మేరకు ఐక్యకూటమి అభ్యర్థి రాజారెడ్డితో పాటు వారి ప్యానల్ సభ్యులందరినీ గెలిపించాలని కార్మికులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  కోరారు.ఆర్టీసీ INTUC, TWU, SWU తదితర సంఘాలతో కూడిన ఐక్యకూటమి వరంగల్ రీజన్ ఆధ్వర్యంలో హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన కార్మిక సభకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఐక్యకూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు ,kUDA చైర్మన్ గుండు సుధారాణి,మాజీ మేయర్ ,ఎన్నికల ఇంచార్జ్ బొంతు రామ్మోహన్,TWU రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి,SWF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి VS రావు,SWF రాష్ట్ర కార్యదర్శి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.