–ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్యకూటమిని గెలిపించాలి –కార్మిక సభలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 6.. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు యూనియన్ల ద్వారానే సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీలో మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో సకల జనుల సమ్మె సమయంలో కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులు, జీతాల ఆలస్యం, బస్సుల్లోనే రోజుల తరబడి కూర్చుని నిరసనలు తెలిపిన పరిస్థితులను గుర్తు...