Thursday, October 22, 2026
Home Politics -సిఈసి జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలి…. -సిఈసి జ్ఞానేశ్ కుమార్ బీజేపీ ప్రభుత్వానికి,...

-సిఈసి జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలి…. -సిఈసి జ్ఞానేశ్ కుమార్ బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి తొత్తులా వ్యవహరిస్తున్నాడు…. -ప్రధాని మోడీ గద్దె దింపి రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం…..ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్…

0
45

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28   జనగామ

 

దేశంలో ప్రజాస్వామ్య పునాదులను కాపాడాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయిందని, ఈ అక్రమాలకు సూత్రధారి అయిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC), తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున చేపట్టిన నిరసన ర్యాలీలో ముఖ్యఅతిథిగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గ, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యెషశ్విని రెడ్డి, డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్బంగా నెహ్రూ పార్క్ వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుంది. ర్యాలీ పొడవునా కాంగ్రెస్ పార్టీ జెండాల రెపరెపలు, ప్రధాని నరేంద్ర మోడీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌లకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో జనగామ పట్టణం మారుమోగింది. ​ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా  కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ నిరసన సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ… సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలను, ఎన్నికల సంఘం వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ​బిజెపి అప్రజాస్వామికంగా దొడ్డిదారిలో తిరిగి అధికారంలోకి రావడానికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని కడియం శ్రీహరి విమర్శించారు. దేశవ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు మరియు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల ఓట్లను జాబితా నుంచి కుట్రపూరితంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమ విధానాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందే గుర్తించి దేశ ప్రజల ముందుకు తీసుకువచ్చారని పేర్కొన్నారు.జ్ఞానేశ్ కుమార్ గతంలో అనేక అవినీతి మరియు ఇతర తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసం, తమ ఆదేశాలకు విధేయుడిగా ఉంటాడనే ఉద్దేశంతోనే ఆయనను రాజ్యాంగబద్ధమైన సీఈసీ పదవిలో నియమించిందని మండిపడ్డారు. ​ప్రస్తుత ఎన్నికల సంఘం ఎంత ఏకపక్షంగా పనిచేస్తోందో చెప్పడానికి కమిషన్ లోపల జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని కడియం తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీసుకుంటున్న ఏకపక్ష మరియు పక్షపాత నిర్ణయాలపై స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘంలోని మరో ఇద్దరు కమిషనర్లే పలుమార్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు రావడం, ఈసీఐ విశ్వసనీయత ఏ స్థాయికి దిగజారిందో తెలియజేస్తోందన్నారు.​జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన ప్రతీ ఎన్నిక ఫలితంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయని, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి ఒక పార్టీకి, కొంతమంది వ్యక్తులకు ఊడిగం చేయడం రాజ్యాంగ వ్యవస్థలకే పెను ముప్పు అని హెచ్చరించారు. చివరకు ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలు సైతం ఎన్నికల సంఘం తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ప్రజాస్వామ్య రక్షణను విస్మరించిన జ్ఞానేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే భర్తరఫ్ చేయాలని లేనిపక్షంలో ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా గ్రామ స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ప్రధాని మోడీ అక్రమ పాలనకు చరమగీతం పాడి, రాహుల్ గాంధీని దేశ ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే వరకు కాంగ్రెస్ శ్రేణులు విశ్రమించవని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు మరియు వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.