-సిఈసి జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలి…. -సిఈసి జ్ఞానేశ్ కుమార్ బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి తొత్తులా వ్యవహరిస్తున్నాడు…. -ప్రధాని మోడీ గద్దె దింపి రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం…..ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 28 జనగామ దేశంలో ప్రజాస్వామ్య పునాదులను కాపాడాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయిందని, ఈ అక్రమాలకు సూత్రధారి అయిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ను వెంటనే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC), తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పిలుపు మేరకు...