Thursday, October 22, 2026
Home Health ప్రధాన రహదారులు, డివైడర్లు పరిశుభ్రంగా ఉండేలా నిరంతర పర్యవేక్షణ….. —జిడబ్ల్యూఎంసి కమిషనర్ వెంకన్న….

ప్రధాన రహదారులు, డివైడర్లు పరిశుభ్రంగా ఉండేలా నిరంతర పర్యవేక్షణ….. —జిడబ్ల్యూఎంసి కమిషనర్ వెంకన్న….

0
23

📰 Generate e-Paper Clip

వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  జిడబ్ల్యూఎంసి, సెప్టెంబర్ 29:

విలీన గ్రామాలతో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, అప్రోచ్ రోడ్లు, డివైడర్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టంగా చేపట్టి, ఎక్కడా పారిశుద్ధ్య లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.మంగళవారం వడ్డేపల్లి చర్చి నుంచి ఉనికిచర్ల ఔటర్ రింగ్ రోడ్డు వరకు బల్దియా పరిధిలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారుల వెంట, డివైడర్ల వద్ద పరిశుభ్రతను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.డివైడర్లలో మొక్కలు ఎండిపోకుండా, ఖాళీలు ఏర్పడకుండా తగిన నిర్వహణ చేపట్టాలని, డివైడర్ల కింద మట్టి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. రహదారులు, డివైడర్లు లేదా ఇతర ప్రాంతాల్లో ఏవైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలన్నారు.ఈ సందర్భంగా గృహిణులతో మాట్లాడిన కమిషనర్, స్వచ్ఛ ఆటోలు ప్రతిరోజూ తమ ప్రాంతాలకు వస్తున్నాయా, తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారా, చెత్త సేకరణ సేవలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు.విలీన గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ స్పష్టం చేశారు. గ్రామాల నుంచి నగరానికి అనుసంధానమయ్యే ప్రధాన రహదారులు, అప్రోచ్ రోడ్లు, డివైడర్లు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రోడ్ల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి గ్యాప్స్ లేకుండా రోజువారీగా మానిటరింగ్ చేపట్టాలని తెలిపారు.పారిశుద్ధ్య కార్మికులందరూ విధి సమయంలో తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి, నిర్దేశిత సమయపట్టిక ప్రకారం విధులు నిర్వహించాలని, క్రమం తప్పకుండా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని సూచించారు. సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని ప్రాంతాలను నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు.అదేవిధంగా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు డీస్లడ్జింగ్ వాహనాలను క్రమం తప్పకుండా పంపించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. సంబంధిత వాహనాల రాకపోకలు, డీస్లడ్జింగ్ ప్రక్రియను సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.నగరంతో పాటు విలీన గ్రామాల్లోనూ ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా పారిశుద్ధ్య వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించాలని కమిషనర్ అధికారులకు స్పష్టం చేశారు.ఈ పరిశీలనలో సిఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ సంజయ్ కుమార్, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.