ప్రధాన రహదారులు, డివైడర్లు పరిశుభ్రంగా ఉండేలా నిరంతర పర్యవేక్షణ….. —జిడబ్ల్యూఎంసి కమిషనర్ వెంకన్న….

వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  జిడబ్ల్యూఎంసి, సెప్టెంబర్ 29: విలీన గ్రామాలతో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, అప్రోచ్ రోడ్లు, డివైడర్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టంగా చేపట్టి, ఎక్కడా పారిశుద్ధ్య లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.మంగళవారం వడ్డేపల్లి చర్చి నుంచి ఉనికిచర్ల ఔటర్ రింగ్ రోడ్డు వరకు బల్దియా పరిధిలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారుల వెంట, డివైడర్ల వద్ద పరిశుభ్రతను పరిశీలిస్తూ...