Author: parivarthanaawaaz

                       ఆలయ నిర్మాణం.. అభినందనీయం                            తహశీల్దార్ రమేష్ బాబు,ఎస్ఐ మాలోత్ సురేష్ పరివర్తన ఆవాజ్ జనవరి7 మహబూబాబాద్ ప్రతినిధి పగడాల రామారావు.నర్సింహులపేట. .ఆలయ నిర్మాణం అభినందనీయమని నర్సింహులపేట తహశీల్దార్ రమేష్ బాబు,ఎస్ఐ సురేష్ అన్నారు.నర్సింహులపేట గ్రామ శివారులో గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు చలిమల్ల యాదగిరి ఆధ్వర్యంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా కాంక్రీటు పనులను బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ రమేష్ బాబు,ఎస్ఐ మాలోత్ సురేష్ మాట్లాడుతూ..గౌడ సంఘం అధ్యక్షునిగా ఉంటూ తన సొంత ఖర్చులతో ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయం అని కొనియాడారు.ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెదమామూల యాకయ్య,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్,ఉప…

Read More

          మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల                                  హడావిడి ప్రారంభం, రంగారెడ్డి, జనవరి 7, (పరివర్తన ఆవాజ్ ) మేడ్చల్ జిల్లాలో మున్సిపాలిటీలలో ఎన్నికల కొలాహలం మొదలైంది. జిల్లాలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండడంతో ఆశావహులు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లాలో కేవలం మూడు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఇటీవల ఏర్పడ్డాయి.గతంలో జిల్లాలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్ లు, 9 మున్సిపాలిటీలో ఉండేవి. ఇవి రింగురోడ్డు లోపల, రింగ్ రోడ్డు ని ఆనుకొని ఉండడంతో ప్రభుత్వం ఇటీవల జిహెచ్‌ఎంసిలో విలీనం చేసింది. అంతకుముందు జిల్లాలోని గ్రామపంచాయతీలన్నీ మున్సిపాలిటీలలో విలీనం చేసింది. రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామాలను కలిపి ఎల్లంపేట,…

Read More

జనవరి 9 నుంచి శ్రీవాణి దర్శన టికెట్లు రోజువారీ ఆన్లైన్ కరెంట్ బుకింగ్‌లోకి. నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు తిరుమలలో ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ నిలిపివేత,{పరివర్తన ఆవాజ్}  భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించనున్నారు.ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్…

Read More

హవేళి ఘణాపూర్ మండలకేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.                  పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. (మెదక్ పరివర్తన ఆవాజ్)  మెదక్ జిల్లా హవేళి ఘణాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేకు కట్ చేసి, మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మిఠాయి పొట్లాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండలకేంద్రమైన హవేళి ఘణాపూర్ గ్రామసర్పంచ్ మేకల సాయిలు, ఉప సర్పంచ్ వడ్ల రాజు, వార్డు సభ్యులు, మండల నాయకులు సతీష్ రావు,…

Read More

టేకులపల్లి గ్రామపంచాయతీలో జగదాంబ దేవి సేవలాల్ మహారాజ్ ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం. టేకులపల్లి, పరివర్తన అవాజ్ న్యూస్ జనవరి 03 :పౌర్ణమిని పురస్కరించుకొని టేకులపల్లి మండలంలో జగదాంబ దేవి సేవలాల్ మహారాజ్ ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మహిళలు ఎంతో భక్తి భావంతో ఉత్సాహంతో పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన పూజారి గణేష్ మహారాజ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో గుడిపూడి సబిత, తిరుచి శ్రీదేవి, ఆమేడ రమ, కేశ పద్మజ, ఉప సర్పంచ్ అనంతుల వసంత, అనంతుల పరమేశ్వరమ్మ, నెల్లూరి ధనలక్ష్మి, నెల్లూరు రాణి, గుండ చంద్రకళ బండ్ల, రజిని, గుగులోతు రమాదేవి, నెల్లూరి ఉజ్జేటి, సరోజ నెల్లూరి కౌసల్య కస్తూరి తదితరులు పాల్గొన్నారు.

Read More

హలో కామ్రేడ్ చలో ఖమ్మం. సిపిఐ శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభ జయప్రదం చేయండి. జిల్లా సిపిఐ నాయకులు గూగులోత్ రామ్ చందర్. టేకులపల్లి, పరివర్తన అవాజ్  జనవరి 03: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో జనవరి 18న 5 లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా టేకులపల్లి మండల ప్రాంతం నుంచి కదిలి రావాలని కోరారు. దేశంలో నాడు స్వతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కోసం ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకోవడం గర్వకారణమని ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ప్రజా సంఘాలకు మహిళలకు విద్యార్థి యువజన రైతులు వ్యవసాయ కార్మికులు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సిపిఐ…

Read More

తప్పుల తడకగా మున్సిపల్ ఓటరు ముసాయిదా తక్షణమే తప్పులను సరి చేయాలి. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ళ.మల్లికార్జున్ గౌడ్ పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు డిమాండ్ ( పరివర్తన ఆవాస్) మెదక్ పట్టణంలో 32 వార్డుల ఓటరు లిస్టు డ్రాప్టు చేసి పొందుపర్చిన జాబితలో తీవ్ర తప్పిదాలు ఉన్నాయని వాటిని సవరించాలని బిఆర్ఎస్ పట్టణ నాయకులు మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ అన్నారు. శనివారం మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్లు,నాయకులతో కలిసి మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కలసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మున్సిపల్ కార్యాలయం ప్రచురించిన ఓటరు ముసాయిదా జాబితలో పూర్తిగా తప్పులు ఉన్నాయని అన్నారు. ఒక వార్డుకు సంబంధించిన ఓటర్లు మరో వార్డులో రావడం…

Read More

గ్రామపంచాయతీఎన్నికల్లో తండ్రి గెలిస్తే కొడుకు ధర్మ భిక్షాటన?          గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలోధర్మభిక్షాటన చేసిన కుమారుడు (పరివర్తనఆవాజ్ న్యూస్) మెదక్ జిల్లా రామాయంపేట మండల జాన్సీ లింగాపూర్ గ్రామం ఇక్కడ జరిగిన ఈ ఘటన ఈ రోజుల్లో అcరుదుగా కనిపించే మాటకు విలువ చెప్పిన రాజకీయ సంఘటనగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో జాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మానెగల రామకృష్ణయ్య విజయం సాధిస్తే…తన మూడో కుమారుడు మానెగల భాస్కర్, ధర్మ భిక్షాటన చేస్తానని గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ…నేడు అక్షరాలా అమలైంది. తండ్రి సర్పంచ్‌గా ఎన్నికైన వెంటనే ఇచ్చిన మాటను మరిచిపోకుండా మూడో కుమారుడు మానెగల భాస్కర్ గ్రామ వీధుల్లో తల వంచి ధర్మ భిక్షాటన చేశాడు.ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ఓట్ల వరకే పరిమితం అనే.విమర్శలు ఉన్న వేళ మాట నిలబెట్టుకున్న ఈ…

Read More

ఉచితంగా LPG గ్యాస్ కనెక్షన్లు అందించిన బీజేపీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మనోహరాబాద్ పరివర్తన అవాజ్  డిసెంబర్ 16,  మనోహరాబాద్ మండలంలో ని పోతారం గ్రామ నూతన సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ తో కలిసి పోతారం లో అర్హులకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు భారత ప్రభుత్వం అందించే ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పథకం, దీని ద్వారా మహిళలకు ఆరోగ్యకరమైన వంట కోసం LPG కనెక్షన్లు, స్టవ్, మరియు మొదటి రీఫిల్ ఉచితంగా లభిస్తాయి ఈ కార్యక్రమం లో మాజీ మండల అధ్యక్షులు నరేందర్ చారి, ఉపసర్పంచ్ నరేందర్,బూత్ అధ్యక్షులు మంచి సాయి రామ్, వార్డు సభ్యులు శ్రీహరి గౌడ్,వికాస్, సోషల్ మీడియా కన్వీనర్ గిరీష్,కిరణ్,

Read More

అగ్రహారం గ్రామ సర్పంచి గా మోడే కాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక పరివర్తన ఆవాజ్ న్యూస్ పెనుబల్లి. సత్తుపల్లి నియోజకవర్గ పెనుబల్లి మండలంలోని అగ్రహారం గ్రామపంచాయతీ సర్పంచిగా మోడే కాంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామపంచాయతీ ను సర్పంచుల దక్కించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు .ఉప సర్పంచిగా శ్రావణి కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి నియమించారు. అగ్రహారం గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికవ్వటంతో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు    

Read More