Author: parivarthanaawaaz

గ్రామపంచాయతీఎన్నికల్లో తండ్రి గెలిస్తే కొడుకు ధర్మ భిక్షాటన?          గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలోధర్మభిక్షాటన చేసిన కుమారుడు (పరివర్తనఆవాజ్ న్యూస్) మెదక్ జిల్లా రామాయంపేట మండల జాన్సీ లింగాపూర్ గ్రామం ఇక్కడ జరిగిన ఈ ఘటన ఈ రోజుల్లో అcరుదుగా కనిపించే మాటకు విలువ చెప్పిన రాజకీయ సంఘటనగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో జాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మానెగల రామకృష్ణయ్య విజయం సాధిస్తే…తన మూడో కుమారుడు మానెగల భాస్కర్, ధర్మ భిక్షాటన చేస్తానని గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ…నేడు అక్షరాలా అమలైంది. తండ్రి సర్పంచ్‌గా ఎన్నికైన వెంటనే ఇచ్చిన మాటను మరిచిపోకుండా మూడో కుమారుడు మానెగల భాస్కర్ గ్రామ వీధుల్లో తల వంచి ధర్మ భిక్షాటన చేశాడు.ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ఓట్ల వరకే పరిమితం అనే.విమర్శలు ఉన్న వేళ మాట నిలబెట్టుకున్న ఈ…

Read More

ఉచితంగా LPG గ్యాస్ కనెక్షన్లు అందించిన బీజేపీ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మనోహరాబాద్ పరివర్తన అవాజ్  డిసెంబర్ 16,  మనోహరాబాద్ మండలంలో ని పోతారం గ్రామ నూతన సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ తో కలిసి పోతారం లో అర్హులకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు భారత ప్రభుత్వం అందించే ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పథకం, దీని ద్వారా మహిళలకు ఆరోగ్యకరమైన వంట కోసం LPG కనెక్షన్లు, స్టవ్, మరియు మొదటి రీఫిల్ ఉచితంగా లభిస్తాయి ఈ కార్యక్రమం లో మాజీ మండల అధ్యక్షులు నరేందర్ చారి, ఉపసర్పంచ్ నరేందర్,బూత్ అధ్యక్షులు మంచి సాయి రామ్, వార్డు సభ్యులు శ్రీహరి గౌడ్,వికాస్, సోషల్ మీడియా కన్వీనర్ గిరీష్,కిరణ్,

Read More

అగ్రహారం గ్రామ సర్పంచి గా మోడే కాంతమ్మ ఏకగ్రీవ ఎన్నిక పరివర్తన ఆవాజ్ న్యూస్ పెనుబల్లి. సత్తుపల్లి నియోజకవర్గ పెనుబల్లి మండలంలోని అగ్రహారం గ్రామపంచాయతీ సర్పంచిగా మోడే కాంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామపంచాయతీ ను సర్పంచుల దక్కించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు .ఉప సర్పంచిగా శ్రావణి కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి నియమించారు. అగ్రహారం గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికవ్వటంతో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు    

Read More

     గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో “కోనేరు చిన్ని. భద్రాద్రి కొత్త గూడెం  పరివర్తన అవాజ్  డిసెంబర్ 08: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాల్వంచ మండలం జగన్నాధపురం,నగరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని)    కాంగ్రెస్ పార్టీ బలపరిచి న జగ న్నాధపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బానోత్ అనిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేసిన కోనేరు చిన్ని.ఈ సందర్భంగా కోనేరు చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు,500 కి గ్యాస్ సిలిండర్,మహిళలకు ఉచిత బస్ సర్వీసు అందించడం జరిగిందని గుర్తు చేశారు.ఇదే కాకుండా పేదవాడి కి సొంత ఇంటి కళా నెరవేర్చటం,SC వర్గీకరణ,రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇస్తామ ని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్…

Read More

       ఆర్టిజన్ కుటుంబానికి కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ ఆర్థిక సాయం కామారెడ్డి పరివర్తన అవాజ్  డిసెంబర్ 08:    కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన, ఎంబరి గౌరయ్య,  అనారోగ్యంతో మరణించడం జరిగింది. అతని కుమారుడు ఏంబరి రామచంద్రం, విద్యుత్తు ఆర్టిజన్గా ఇసాయిపేటలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఇట్టి అకాల మరణాన్ని, కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ తీవ్ర సానుభూతిని వ్యక్తపరిచింది, తమ జాక్ కుటుంబానికి, సానుభూతిపరంగా ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ జాక్ నాయకులు, ఎం. నాంపల్లి, యు. బాల్ నర్స్. ఉప్పు స్వామి, ఎస్ రాజు, వై. పోచయ్య. తదితరులు పాల్గొన్నారు.  

Read More

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే యం.పద్మాదేవేందర్ రెడ్డి. (పరివర్తన)/ ఆవాజ్ న్యూస్. మెదక్  జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్,మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… అభయానికి మారుపేరుగా నిలిచే ఆంజనేయస్వామి ఆరాధ్య దైవం అన్నారు. అభయాంజనేయ స్వామి దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాదే.చంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె.జితేందర్ గౌడ్, నాయకులు ఉమామహేశ్వర్, రాజు యాదవ్, దాసు, సుభాష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More

మెదక్ జిల్లాలో వలస కూలీల పిల్లల దుర్భర పరిస్థితులు అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం (పరివర్తన) ఆవాస్ న్యూస్ మెదక్ జిల్లా,  చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామ శివారులోని ఎస్‌జి స్నాక్స్ పరిశ్రమ వద్ద బీహార్‌ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీల పిల్లలు అమానుష పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన కూలీలతో పాటు వారి పిల్లలు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. అయితే వారికి కనీస అవసరాలైన వసతి, పరిశుభ్రత, తాగునీరు, విద్య వంటి సౌకర్యాలు లేకపోవడంతో జీవితం అద్వానంగా మారింది. సుమారు 30 మంది చిన్నారులు ఎలాంటి సదుపాయాలు లేని ప్రాంతంలో రోజంతా మట్టిలో ఆడుతూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమ యాజమాన్యం పిల్లల కోసం సౌకర్యం కూడా కల్పించకపోవడంతో పాటు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ సమస్యను పట్టించుకోకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. బాల కార్మిక వ్యవస్థ, శిశు…

Read More

ప్రభుత్వ భూమిలో ఎస్ జి స్నాక్స్ కంపెనీ నిర్మాణం!                             ఏడాదిగా నిద్రమత్తులో రెవెన్యూ అధికారులు         నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న పంచాయతీ కార్యదర్శి  మెదక్  జిల్లా ప్రతినిది డిసెంబర్ 6 (పరివర్తన అవాజ్),    పేదలు పూరి గుడిసె వేసుకోవడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఒక గుంట భూమి ఇవ్వమంటే ఇవ్వడానికి నిరాకరిస్తున్న ప్రభుత్వాలు, స్థానిక అధికారులు.. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని మాత్రం వ్యాపారులకు కట్టబెడుతున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట మండలం, కామారం పంచాయతీ పరిధిలో జరిగిన భూ కబ్జా వ్యవహారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. కామారం పంచాయతీ పరిధిలో గల 166 సర్వే నెంబర్లో ఉన్న సుమారు 0.39.5 గుంటల…

Read More

ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు మృత్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పరివర్తన అవాజ్– కారేపల్లి, డిసెంబర్ 6: మండలంలోని బొక్కల తండా గ్రామానికి చెందిన అజ్మీరా బావుసింగ్- సువాలి కుమారుడు అజ్మీరా విజయ్ కుమార్ విద్యుత్ ఘాతంలో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వాంకుడోత్ హనుమంతరావు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు శనివారం మృతుడి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా హనుమంత రావు మాట్లాడుతూ… విజయ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.మృత్యువు కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హాట్కార్ రాంబాబు నాయక్, అజ్మీరా హేమ్లా నాయక్, అజ్మీరా నారాయణ, అజ్మీరా రవి, మాలోత్ బాలు, అజ్మీరా శంకర్ అజ్మీరా దేవా, జర్పలా రామారావు, అజ్మీర చిట్టిబాబు, అజ్మీరా రామారావు, బానోత్ బాబు,అజ్మీరా తిరుపతి,…

Read More

చల్లసముద్రం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ లో నుంచి నలుగురు సస్పెండ్‌! చల్లసముద్రం పరివర్తన ఆవాజ్ డిసెంబర్ 06: చల్లసముద్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటి భిక్షంకు వ్యతిరేకంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఎల్లంపల్లి బుచ్చయ్య, సట్ల శ్రీను, మరియు మోడెం కోటయ్య,కాటూరి సతీష్ లను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి సైదులు ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలకు భంగం కలిగించే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని, 29 గ్రామ పంచాయతీలలోని అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపించబడిందని, గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయని అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వల్ప కాలంలోనే అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ కింద ₹10…

Read More