Author: parivarthanaawaaz

           గుండెపోటుతో బల్లెం బిక్షం మృతి. టేకులపల్లి పరివర్తన అవాజ్  జనవరి 29, టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు బల్లెం బిక్షం (50) హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హఠాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. మృతునికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు. ఉపాధ్యాయుడుగా 15 సంవత్సరాలుగా పనిచేసి అనేక మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది అనేక మంది మన్ననలు పొందారు. గత ఐదు సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ తరఫున సులానగర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పని చేసారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున చురుకుగా పనిచేసి సర్పంచ్ గెలుపు కు బాసటగా నిలిచాడు. బిక్షం మన మధ్య లేరని గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. బిక్షం కు రాజకీయ ప్రముఖులు గ్రామస్తులు భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

Read More

      రామాయంపేటలో రెండో రోజు 51 నామినేషన్లు దాఖలు                             స్పెషల్ అధికారి సాయిబాబా (పరివర్తన ఆవాజ్ ) మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు అత్యంత ఉత్సాహంగా సాగింది. గురువారం ఒక్కరోజే వివిధ పార్టీల నుంచి,51 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి సాయిబాబా ప్రకటించారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ మద్దతు దారులతో భారీగా తరలి రావడంతో మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో రాజకీయ సందడి నెలకొంది.​పార్టీల వారీగా వివరాలను వెల్లడిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి 24, బీఆర్ఎస్ (BRS) నుంచి 13, బీజేపీ (BJP) నుంచి 10 నామినేషన్లు అందగా,మరో నలుగురు స్వతంత్రులు (ఇండిపెండెంట్లు) తమ నామినేషన్ పత్రాలను సమర్పించారని సాయిబాబా తెలిపారు. పట్టణంలోని శ్రీ శక్తి భవనంలో ఏర్పాటు…

Read More

వైష్ణవ జన తో’ తెలుగు వెర్షన్‌ను ‘గాంధీ మార్గం’ ను నాటక రూపంలో ప్రదర్శించిన సీబీసీ        స్వచ్ఛతా పక్వాడా, అమరవీరుల దినోత్సవం సందర్భంగా       హైదరాబాద్‌లో ‘గాంధీ మార్గం’ కార్యక్రమాన్ని నిర్వహించిన సీబీసీ హైదరాబాద్ (పరివర్తన ఆవాజ్) . స్వచ్ఛతా పక్వాడా, అమరవీరుల దినోత్సవం, వందేమాతరం 150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), తిరుమలగిరి లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సహకారంతో బుధవారం రోజున గాంధీ మార్గం అనే కార్యక్రమం ద్వారా ‘వైష్ణవ జన తో’ భజనను నాటక రూపంలో ప్రదర్శించింది. ప్రదర్శన అనంతరం పెద్దఎత్తున విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. మహాత్మాగాంధీ ఆశయ స్ఫూర్తితో విలువలతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించటం దీని లక్ష్యం. ఈ కార్యక్రమంలో సీబీసీ సీనియర్ అకౌంట్స్ అధికారిణి మంగళ, ఇతర అధికారులు మరియు సిబ్బందితో పాటు…

Read More

       మానవత్వం చాటుకున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్        క్షతగాత్రులను స్వయంగా అంబులెన్సులో ఎక్కించిన అదనపు ఎస్పీ (పరివర్తన ఆవాజ్) రామాయంపేట: అక్కన్నపేట గ్రామ శివారులోని మెదక్ రామాయంపేట రహదారి అక్కన్నపేట ఫారెస్ట్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్వాపూర్ గ్రామం నుంచి పాతూర్ సంతకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అదే వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడగా, ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.ఇదే సమయంలో రామాయంపేట వైపు వెళ్తున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ గారు ప్రమాదాన్ని గమనించి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సహాయపడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆయన తన గన్‌మన్ ప్రశాంత్, డ్రైవర్ గోవర్ధన్, సహాయంతో గాయపడిన…

Read More

       28 వార్డులో నీటి సమస్యను పరిషరిస్తా                             24 గంటలు ప్రజలకు అందుబాటులో వుంటా                                    బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండి పూజ నరేష్  (పరివర్తన ఆవాజ్ ) 28వార్డులో గతపాలకులు హామీలు ఇచ్చి వార్డు అభివృద్ధి చెయ్యలేదుని మాటకు కట్టుబడి వుంటామని హామీలు ఇచ్చి మాటలు తప్పరని 28 వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బండి పూజనరేష్ ఆరోపించారు. బుధువారం రోజున మెదక్ మున్సిపల్ కార్యాలయంలో 28 వార్డు నుండి బిఆర్ ఎస్ పార్టీ నుండి నామినేషన్ ధఖాలు చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి నా లక్ష్యంని వార్డులొ అన్ని…

Read More

 ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోనే పేదలకు నాణ్యమైన విద్య                                            ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ (పరివర్తన అవాజ్)  తెలంగాణలో ప్రభుత్వ విద్యా రంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రజల భాగస్వామ్యం తోనే ప్రభుత్వ పాఠశాల లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.బుధవారం సాయంత్రం మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ‘తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ మెదక్ జిల్లా సర్వసభ్య సమావేశం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.​ఈ సందర్భంగా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 15శాతం నిధులు కేటాయించాలని, అప్పుడే మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుందని డిమాండ్ చేశారు. ​ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు…

Read More

ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలి                                 జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (పరివర్తన ఆవాజ్ ) పవిత్ర ఏడుపాయల వరదుర్గా మాత జాతర ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పవిత్ర ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఘనంగా నిర్వహించాలని, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పార్కింగ్,విద్యుత్ ,తాగునీరు బార్కెట్స్ లను ఏర్పాటు చేయాలన్నారు.జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లు, చిత్త సేకరణ, బ్లీచింగ్…

Read More

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకే బిజెపి కుట్ర జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగిస్తే సహించేది లేదు (పరివర్తన అవాజ్) మెదక్ జిల్లా చిన్నశంకరం పేటమండలం కొరివి పల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ నిరసన కార్యక్రమానికి పిసిసి వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరయ్యారు వారికి ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ శాలువాలతో సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు అనంతరం కొరివి పల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారి వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం…

Read More

మెదక్ మున్సిపల్ ఎన్నికలసందడి                   తొలిరోజు 12 నామినేషన్లు (పరివర్తన అవాజ్ ) మున్సిపల్ ఎన్నికల సమరంలో భాగంగా మెదక్ పట్టణంలో నామినేషన్ల పర్వం ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజైనబుధవారం, రాజకీయ సందడి నెలకొనగా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 12 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ​ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికంగా 5 నామినేషన్లు దాఖలు కాగా, బిఆర్ఎస్ (BRS) పార్టీ నుండి 5 . BJP పార్టీ నుండి 2 నామినేషన్ వేశారు. మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగింది. నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించాలని ఎన్నికల అధికారి తెలిపారు మున్సిపల్ కార్యాలయం ముందు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి…

Read More

            రామాయంపేటలో మున్సిపల్ ఎన్నికల సందడి                                 తొలిరోజు 7 నామినేషన్లు (పరివర్తన అవాజ్ )  మున్సిపల్ ఎన్నికల సమరంలో భాగంగా రామాయంపేట పట్టణంలో నామినేషన్ల పర్వం ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజైన బుధవారం, రాజకీయ సందడి నెలకొనగా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 7 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ​ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికంగా 5 నామినేషన్లు దాఖలు కాగా, బిఆర్ఎస్ (TRS) పార్టీ నుండి ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు నామినేషన్ వేశారు. మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగింది. నిబంధనల ప్రకారం…

Read More