Author: parivarthanaawaaz
నూతన విద్యా *విధానంతోనే దేశాభివృద్ధి సాధ్యం జాతీయసెమినార్ ముగింపులో వక్తల ఉద్ఘాటన {కామారెడ్డి పరివర్తన ఆవాజ్} ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ ఈ పి)– 2020: ఏ ట్రాన్స్‌ఫర్మేటివ్ షిఫ్ట్ ఇన్ ఇండియా ఎడ్యుకేషన్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సెమినార్ శనివారం ఘనంగా ముగిసింది. కళాశాల ప్రిన్సిపల్ మరియు సెమినార్ అధ్యక్షులు డాక్టర్ కె. విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు వేడుకలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ నాయుడు అశోక్, తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సభ ప్రారంభానికి ముందు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. సభకు అధ్యక్షత వహించిన కళాశాల…
నూతన విద్యా విధానం తోనే సమగ్ర విద్యా వికాసం: కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్ : [కామారెడ్డి పరివర్తన అవాజ్] ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ‘ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈ పి 2020 : ఏ ట్రాన్స్‌ఫర్మేటివ్ షిఫ్ట్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై రాజనీతి శాస్త్రంలో రెండు రోజుల జాతీయ సెమినార్ అట్టహాసంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన, విద్యార్థినుల స్వాగత నృత్యం మరియు సెమినార్ సావనీర్ ఆవిష్కరణతో కార్యక్రమం ఘనంగా మొదలైంది. డా. కె. విజయ్ కుమార్ ప్రిన్సిపాల్ & అధ్యక్షులు విద్యా రంగంలో వస్తున్న మార్పులు, పరిశోధనల ప్రాముఖ్యతను వివరించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఇలాంటి సెమినార్లు విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.డా. డి.ఎస్.ఆర్. రాజెందర్ సింగ్ (జాయింట్ డైరెక్టర్, కళాశాల విద్య) నూతన విద్యా విధానం మానవాళి అభివృద్ధికి…
ప్రాంగణ నియామకాల్లో 12 మంది విద్యార్థులు ఎంపిక (పరివర్తన ఆవాజ్ కామారెడ్డి ). ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల కామారెడ్డిలో టి యస్ కె సి మరియు ఫీజికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ” జూమ్ గ్రూప్ మరియు సైబర్ సెంటినల్ ” బహుళజాతి కంపెనీల కొరకు సోమవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 12 మంది కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా కె విజయ్ కుమార్ తెలిపారు . ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, నేటి తీవ్ర పోటీ ప్రపంచంలో బహుళజాతి సంస్థలు స్వయంగా గ్రామీణ ప్రాంతాల కళాశాలలకు వచ్చి ప్రాంగణ నియామకాలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా కామారెడ్డి వంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేయడం సంస్థల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిభ, పట్టుదల, కృషిలో ఎలాంటి లోటు లేకుండా పట్టణ ప్రాంత…
ఒడిశా గవర్నర్‌తో తెలంగాణ మీడియా ప్రతినిధి బృందం భేటీ ఒడిశా ప్రగతిశీల వృద్ధితో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు: గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి {హైదరాబాద్ పరివర్తన ఆవాజ్ ఫిబ్రవరి 6 } పీఐబీ నేతృత్వంలో తెలంగాణ మీడియా ప్రతినిధి బృందం ఈ రోజు లోక్ భవన్‌లో ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిని కలిసింది. ప్రతినిధి బృందాన్ని సాదరంగా స్వాగతించిన గవర్నర్… ఒడిశా అభివృద్ధి ప్రయాణం, జాతీయ పురోగతికి పెరుగుతున్న ఒడిశా సహకారం గురించిన విశేషాలను పంచుకున్నారు.మీడియా ప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఒడిశా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని, రాష్ట్ర ఆర్థిక పునాదులను బలోపేతం చేసుకుంటోందని అన్నారు. మిగులు ఆదాయం గల రాష్ట్రంగా…
7వ వార్డు గజవాడ నాగరాజు ఇంటింటి ప్రచారం గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా గజవాడ నాగరాజు {మెదక్ జిల్లా పరివర్తన ఆవాజ్} మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ ఏడవ వార్డు పరిధిలోని గొల్లిపర్తి లో ఆదివారం కాంగ్రెస్ శ్రేణుల రాకతో సందడిగా మారింది. కౌన్సిలర్ అభ్యర్థి గజవాడ నాగరాజు తన మద్దతు దారులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చి, గ్రామస్తుల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, గొల్లిపర్తిని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. వార్డులో ఏళ్ల తరబడి వేధిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటి వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని, ప్రతి గల్లీలో ఆధునిక మురుగునీటి కాలువలు (Drainage) నిర్మించి శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అదేవిధంగా, మట్టి రోడ్ల స్థానంలో నాణ్యమైన సి.సి. రోడ్ల నిర్మాణం…
మెదక్ పట్టణంలోని రెండవ. మూడవ వార్డ్ లలో కాంగ్రెస్ పార్టీరాష్ట్ర నాయకులు ఎస్సార్ ప్రసాద్ ఇంటింటి ప్రచారం (పరివర్తన ఆవాజ్ ) మెదక్ పట్టణంలోని రెండవ మూడవ వార్డ్ ఇంచార్జ్ కాంగ్రెస్ పాటి రాష్ట్ర నాయకులు ఎస్ ఆర్ ప్రసాద్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎరికాలి నరసింహులు. కందుల యశోద మైపాల్ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని ఆయన అన్నారు . అధికార పార్టీలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డ్ లు అభివృద్ధి చెందుతాయనిఅన్నారు ప్రస్తుతం మూడవ వార్డు పరిస్థితి దారుణంగా ఉందని గత ఐదేళ్ల నుండి అధికారంలో ఉన్న స్థానిక నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు ఏ ఒక్క మురికి కాలువ. సీసీ రోడ్డు నిర్మించలేదని ఆయన అన్నారు అభివృద్ధి అంటే ఇంట్లో కూర్చొని చెప్పుడు…
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకో మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఆసిఫ్ బీబీపేట పరివర్తన ఆవాజ్ జనవరి 30, బీబీపేట మండల కేంద్రంలో మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ మహమ్మద్ అసిఫ్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆసిఫ్ గారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి రోడ్డుపై ఫ్యామిలీతో నిరసన తెలుపుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారితో బూతు మాటలు తిడుతూ ముస్లిం పోలీస్ అధికారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం సరైన పద్ధతి కాదని . మతం పేరుతో తుర్కోడు అని నోటికి వచ్చిన విధంగా ఒక వర్గం ప్రజలను కించపరుస్తూ మాట్లాడిన కౌశిక్ రెడ్డి నీ పద్ధతులు మార్చుకొని గతంలో నీ బ్రతుకు ఒకసారి ఆలోచించుకో ప్రాణ బిక్ష పెట్టుమని నువ్వు నీతో…
నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ కామారెడ్డి పరివర్తన ఆవాజ్ జనవరి 30, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ వార్డు ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని శుక్రవారం ఇంచార్జి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సందర్శించి పరిశీలించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గత బుధవారం నుంచి మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 31 చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు అందిన నామినేషన్ల సంఖ్య, నియమించిన ఆపరేటర్ల వివరాలు, అభ్యర్థుల సంఖ్య, FST, SST బృందాల ఏర్పాటు, శిక్షణ తరగతుల…
బోడు లో ఘనంగా వనదేవతల జాతర. సమ్మక్క సారక్క లకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు. టేకులపల్లి, పరివర్తన అవాజ్ జనవరి 29.టేకులపల్లి మండలం బోడు గ్రామంలో సమ్మక్క-సారలమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాల మధ్య గురువారం సారలమ్మ తల్లి బోడు గుట్టపై ఉన్న గద్దెపై కొలువుదీరింది. బోడు చుట్టుపక్కల, గ్రామాలైన ముక్కంపాడు, రామచంద్ర పేట, మురుట్ల , టేకులపల్లి, జంగాలపల్లి గ్రామాల నుండి వనదేవతలైన సమ్మక్క సారమ్మలను గ్రామస్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం తమ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని,పాడి పంటలను సమృద్ధిగా పండాలని, వనదేవతల దీవెనలు మెండుగా ఉండాలని భక్తులు కోరుకున్నారు.
జీవో నెంబర్ 3 స్థానంలో కొత్త జీవో ను తీసుకువచ్చి ఏజెన్సీ నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ప్రభుత్వానికి డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో పరివర్తన అవాజ్ జనవరి 29, సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ఏరియాలో ఆర్టికల్ 244(1) పార్ట్ ఏ. బి. సి. డి లను ననుసరించి నివాసాలు, నిధులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, భూముల క్రయ విక్రయాలు స్థానిక గిరిజనులకే 100% శాతం సర్వ హక్కులు ఉంటాయని రాజ్యాంగం చెపుతుంది. కానీ, జీవో నెంబర్.3 జీవోను సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులు ఉద్యోగాలకు…
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.