Author: parivarthanaawaaz
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం.. రాష్ట్రంలో మొదటిసారిగా 428 యూనిట్ల రక్తాన్నిసేకరించిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్.. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం కావడం జరిగిందని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గడ్డం మల్లేష్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరం యొక్క ఉద్దేశం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడాలని మరియు పోలీసు అమరవీరుల త్యాగాలను తెలియజేయాలని ఉద్దేశంతో నిర్వహించడం జరిగిందని,రక్తదానం చేసిన వారందరికీ హెల్మెట్లను అందజేశామని రక్తదానం పైన అవగాహననే కాకుండా,ట్రాఫిక్ నిబంధనలను పైన అవగాహన కల్పించడం జరిగింది.దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ…
కామారెడ్డి జిల్లా పోలీసుల సూపర్ రికార్డ్: ప్రతి నెల 150కు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ • ప్రతి నెల 150 కు పైగా ఫోన్స్ రికవరీ చేస్తున్న జిల్లా పోలీసులు .• ఈ సంవత్సరం రూ. 2 కోట్ల 53 లక్షల విలువైన 1579 ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందించాము• స్పెషల్ డ్రైవ్ ద్వారా 164 (మొత్తం విలువ సుమారు ₹27 లక్షలు) పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ. • మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి, ఫోన్ వినియోగించడంలో జాగ్రత్తలు పాటించాలి.• బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చు., సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదు – CEIR ద్వారా తిరిగి పొందవచ్చు అని జిల్లా పోలీస్ అధికారి శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ …
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా పోషక మాసం ముగింపు కార్యక్రమం, గురువారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో మహిళా మరియు శిశు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ పోషక మాసం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన పోషకమాసం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం రోజూ తినే ఆహారంలో చక్కెర, ఆయిల్ మరియు ఉప్పు స్థాయిలను తగ్గించి వాడుకోవాలని సూచించారు. అంగన్వాడిలలో నిర్వహించే సామాజిక వేడుకలను మరింత బలోపేతంగా నిర్వహించాలని సూచించారు. వీటి ద్వారా కమ్యూనిటీలో అవగాహన తీసుకురాగలమని చెప్పారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలకు , బాలింతకు అంగన్వాడి కేంద్రం కేంద్రాలలో సరైన పోషక పోషక విలువలు కలిగిన ఆహారం…
అమరవీరుల స్మరణలో విద్యార్థులకు వ్యాసరచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు, • రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, మరియు విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు ఆహ్వానం.• అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) కార్యక్రమాలు ప్రారంభం.• పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో విద్యార్థులకు ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ.• పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 21-10-2025 నుండి 31-10-2025 వరకు వివిధ కార్యక్రమాలతో నిర్వహించడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్కామారెడ్డి జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేస్తూ ప్రజల భద్రతకు, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు విశేష సేవలు అందించారు. వారి త్యాగల ఫలితమే నేటి మన శాంతియుత భద్రతతో కూడిన సమాజం అని ఎస్‌పి తెలిపారు. వారి వీరోచిత త్యాగాలను స్మరించుకోవడంలో భాగంగా, తెలంగాణ…
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో (పరివర్తన ఆవాజ్ న్యూస్, అక్టోబర్14) వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు.మంగళవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, వ్యవసాయ, సహకార, డీఆర్‌డీఏ, తూనికలు-కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖాధికారులు మరియు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉందని, అందులో సన్నరకం 2,02,862 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 35,315 మెట్రిక్ టన్నులు ఉంటాయని తెలిపారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు…
మైనర్ బాలికలకు పోక్సో చట్టం పై అవగాహన కల్పిస్తున్న భరోసా ఎస్సై సుచిత. పరివర్తన ఆవాజ్. అక్టోబర్ 14 ; మైనర్ బాలిక పై అత్యాచారం లైంగిక వేధింపులు వంటివి చేసినట్లయితే వారిపై పోక్సో చట్టం ద్వారా చర్య తీసుకోబడుతుందనీ, ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడినట్లయితే మూడు సంవత్సరాల నుండి జీవితకాలం శిక్ష విధించవచ్చని ఒక లక్ష వరకు జరిమానాను విధించబడుతుందని అన్నారు. భరోసా కేంద్రాలు మన తెలంగాణలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 33 జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక భరోసా సెంటర్ ఉంటుందని ఈ భరోసా సెంటర్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే ఆ బాధితులకు న్యాయం చేస్తామని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో హవేలీ ఘనపూర్ మండలంలోని ముత్తాయి కోట మద్దుల్వాయి గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరానికి హాజరైన భరోసా కేంద్రం ఎస్సై సుచిత గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో…
అత్యాచారం చేసిన కేసును చేదించిన పోలీసులు పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 14 ; గత శనివారం కొల్చారం మండలం ఏడుపాయల మూడవ బ్రిడ్జి వద్ద గిరిజన మహిళ పైఅత్యాచారం జరిగిన సంఘటన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందిన సంఘటన తెలిసింది ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది నిందితుడి కోసం ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిందితుడి కోసం దర్యాప్తు వేగవంతం చేశారు మెదక్ పట్టణంలోని అన్ని సిసి టీవీ ఫుటేజ్ లను చూడగా మెదక్ ఓల్డ్ బస్టాండ్ సమీపంలోని ఒక వైన్ షాప్ వద్ద ఉన్న సీ.సీ.టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని మరణించిన మహిళతో మాట్లాడినట్టు అనంతరం వారిద్దరూ నడుచుకుంటూ వెళ్లినట్టు సిసి టీవీ ఫుటేజ్ లో చూడడంతో నిందితుడిని పట్టుకొని విచారించగా నిందితుడు మెగావత్ ఫకీరా నాయక్ పని ఇప్పిస్తానంటూ మహిళను ఏడుపాయల దేవస్థానం దారిలోని మూడవ…
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలి. పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 14 మహబూబాబాద్. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల సమస్యలను పరిష్కరించాల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్థాయిలో విద్యా సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆయన చెప్పారు — “గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమి విద్యార్థుల భవిష్యత్తును చీకటిలో నెడుతోంది. వసతి గృహాల్లో ఫ్యాన్లు లేక, కరెంటు స్విచ్‌బోర్డులు దెబ్బతిని ఉండటం వల్ల విద్యార్థులు తీవ్రమైన వేడిని తట్టుకోలేక రాత్రంతా నిద్రలేక అవస్థలు పడుతున్నారు. పాఠశాల తరగతి గదుల్లో కూడా ఫ్యాన్ సౌకర్యం లేక విద్యార్థులు చెమటలు…
తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి ఫైర్ పరివర్తన ఆవాజ్ దినపత్రిక Oct 14, 2025, తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి ఫైర్ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత వీ శ్రీనివాస్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్రంగా మండిపడ్డారు. మాగంటి సునీత తన భర్తను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటే దానిని డ్రామా, యాక్షన్ అనడం సరికాదని ఆయన మంగళవారం అన్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్లతో గెలిచి మంత్రి అయిన తుమ్మల, అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలో ఆయన భార్య, పిల్లలు ప్రచారం చేస్తే దానిని యాక్షన్ అనడం అమానుషమని గౌడ్ విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కామారెడ్డిలో అమ్మ భగవాన్ ఆలయంలో భక్తి పూర్వక అన్నదాన కార్యక్రమం పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 14; కామారెడ్డి పట్టణంలోని అమ్మ భగవాన్ ఆలయంలో ఈరోజు భక్తి పూర్వకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు పాల్గొని భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా దీపం జ్యోతి పరంజ్యోతి అమ్మవారి భక్తులు మరియు ఎర్ర విజయ గుప్తా పాల్గొని సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో సత్సంగం నిర్వహించి, భగవాన్ తత్వంపై మంత్రోచ్చారణలు చేశారు. భక్తి వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.