Author: parivarthanaawaaz

        పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం                     వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. వరంగల్ జిల్లా ప్రతినిది అక్టోబర్ 21 (పరివర్తన అవాజ్) శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములోఅమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, వరంగల్, హనుమకొండ…

Read More

అమరుడైన పోలీస్ కుటుంబానికి రూ.1 కోటి, ఉచితంగా భూమి.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన, పరివర్తన అవాజ్, హైదరాబాద్, అక్టోబర్ 21: పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గోషామహాల్​‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్​ ఫ్లాగ్​ డే పరేడ్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన పోలీస్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడని చెప్పారు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా… మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి…

Read More

                  హాస్యనటుడు, దర్శకుడు అస్రాని మృతి పరివర్తన అవాజ్,      ప్రముఖ బాలీవుడ్, గుజరాతీ నటుడు గోవర్ధన్ అస్రానీ (84) అక్టోబర్ 20వ తేదీ అనారోగ్యంతో హాస్పిటల్ కన్నుమూశారు. జైపూర్ లో సింధీ కుటుంబానికి చెందిన అస్రానీ తండ్రి చేస్తున్న కార్పెట్ వ్యాపారం చేయడం ఇష్టంలేక సినిమాల్లోకి వచ్చారు. పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుని ఆ తర్వాత గుజరాతీ, హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన మూడు వందలకు పైగా చిత్రాలలో నటించారు. ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలలో హీరోగానూ యాక్ట్ చేశారు. తన సహ నటి మంజు బన్సాల్ ను ఆయన ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వివాహానంతరం కూడా వీరిద్దరూ కలిసి పలు చిత్రాలలో నటించారు. 1975లో విడుదలైన ‘షోలే’ సినిమాలో జైలర్…

Read More

అమరవీరుల త్యాగమే నేటి శాంతి సౌభ్రాతృత్వానికి పునాది — కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర  వీర కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు త్యాగాల వల్లే నేటి సమాజంలో శాంతి, భద్రత కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. పరివర్తన అవాజ్,   కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్, ఐఏఎస్  మరియు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. శాంతి, సౌభ్రాతృత్వం నేడు కనిపించడం అమరవీరుల త్యాగ ఫలమని జిల్లా కలెక్టర్  పేర్కొన్నారు. పోలీసులు ప్రజల రక్షణ, భద్రత, శాంతి స్థాపన కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో విధి నిర్వాహణలో…

Read More

  వీళ్ళు నిద్రపోరే… వీళ్ళు మన రక్షకులే – పోలీసు అమరవీరుల నివాళి       దినోత్సవం, పరివర్తన అవాజ్,   అంతర్యామిలా శాంతిని కాపాడే వారు… ప్రజల భద్రత కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసే వారు… వాళ్ళే మన పోలీసులు. అందరూ నిద్రపోతే… వీళ్లు మేల్కొని ఉంటారు. అందరూ పండగలు జరుపుకుంటే… వీళ్లు కర్తవ్యాన్ని జరుపుకుంటారు. మనమందరం శాంతిగా జీవించేందుకు, సురక్షితంగా నడిచేందుకు వీళ్ళు జీవితం అంకితం చేశారు. ఈరోజు అక్టోబర్ 21 – పోలీసు అమరవీరుల దినోత్సవం. ఈ సందర్భంగా, తమ ప్రాణాలను దేశ ప్రజల కోసం త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు మన హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం. వీరుల త్యాగం వల్లే ఈ రోజు మనం ఇలాగే స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. వారిని స్మరించుకోవడం, గౌరవించడం — మన బాధ్యత, మన ఋణం. ఈ సందర్భంగా… మనమందరం ఒక్కసారి మన హృదయాన్ని వాల్చి, పోలీస్ అమరవీరుల సాహసానికి,…

Read More

ఒక పక్క కానిస్టేబుల్ అంత్యక్రియలు.. మరోపక్క రియాజ్ ఎన్కౌంటర్, పరివర్తన అవాజ్,    కత్తితో దాడి చేసి కానిస్టేబుల్ ప్రమోద్ ను హతమార్చిన రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను పోలీస్ కానిస్టేబుల్ గన్ గుంజుకుని ఆసుపత్రి నుండి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ రోజే కానిస్టేబుల్ అంతక్రియలు జరిగాయి. పోలీసులు యూనిఫామ్ వేసుకొని అతని పాడే మోశారు. మరోవైపు రియాజ్ ఎన్కౌంటర్ కూడా జరిగింది.

Read More

              జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పరివర్తన అవాజ్ జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిసోమవారం జహీరాబాద్ పట్టణంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొనడంతో శివప్ప (52) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More

           కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్ పరివర్తన అవాజ్   తెలంగాణ : నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించి పారిపోతుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కాగా నిజామాబాద్‌లో వరుస వాహన, గొలుసు చోరీలకు పాల్పడుతున్న నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ వస్తే.. కత్తితో దాడి చేసి అతడిని దారుణంగా హత్య చేశాడు.

Read More

             పేకాట ఆడుతూ పట్టుబడిన రాజకీయ ప్రముఖులు, పరివర్తన అవాజ్,      పేకాట ఆడుతూ పట్టుబడిన రాజకీయ ప్రముఖులుతెలంగాణ : వరంగల్‌ కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాట ఆడుతూ రాజకీయ ప్రముఖులు పట్టుబడ్డారు. ఆదివారం రాత్రి కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే దోనెపూడి, గూడూరు హరిబాబు, సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. వారి నుంచి రూ.3,68,530 నగదు, 15 సెల్‌ఫోన్లు, పేకాట కార్డులు, టోకెన్లను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు

Read More

దారుణం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్య పరివర్తన అవాజ్ , దారుణం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్యతెలంగాణ : కన్నబిడ్డలను చంపి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతులను బాపట్ల జిల్లా జనకారం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి (27), అవంతిక (9), భవన్ సాయి (7)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆపై ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More