Author: parivarthanaawaaz

                    నిర్మల్: వార్డెన్ ఆత్మహత్యాయత్నం! పరివర్తన అవాజ్ నిర్మల్: వార్డెన్ ఆత్మహత్యాయత్నం! లక్సెట్టిపేట మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ రాజగోపాల్, ఈనెల 18న సాయంత్రం తన ఇంట్లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, విద్యార్థుల సంఖ్యను 100 నుంచి 2528కు పెంచేందుకు కృషి చేశాడు. బిల్లులు రాకపోవడంతో రూ. లక్షల వరకు సొంతంగా ఖర్చు చేసినట్లు, దీనిపై మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి వివరాలు సేకరిస్తామని, ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.

Read More

     భార్యపై అనుమానం.. బ్రిడ్జ్ పైనుంచి తోసేసి హత్య చేసిన భర్త పరివర్తన అవాజ్, భార్యపై అనుమానం.. బ్రిడ్జ్ పైనుంచి తోసేసి హత్య చేసిన భర్త తెలంగాణ : మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారి బ్రిడ్జ్‌పై ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారుణ ఘటన జరిగింది. మందమర్రి ప్రాంతానికి చెందిన రజిత అనే మహిళను ఆమె భర్త కుమార్‌ స్వామి వంతెనపై నుంచి తోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రజిత మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన భర్త కోపంతో ఈ హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Read More

                 చందన బ్రదర్స్’ అధినేత కన్నుమూత పరివర్తన అవాజ్   చందన బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్ రావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలు, ఫర్నీచర్, జువెలరీ అందించే లక్ష్యంతో 1971లో చందన బ్రదర్స్ సంస్థను ఆయన ప్రారంభించారు. దూరదృష్టితో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రిటైల్ సంస్థగా నిలిపారు.

Read More

                    పండగ పూట విషాదం. పరివర్తన అవాజ్20,      పండగ పూట విషాదం..నిజామాబాద్ నగరంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున వినాయక్ నగర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన దొంతుల అరుణ్ కుమార్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. బోర్గాం వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు అరుణ్​ కుమార్​ బైక్​ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్​ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More

ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు                          ఎమ్మెల్యే కోరం కనకయ్య పరివర్తన అవాజ్ న్యూస్ ఇల్లందు: చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ సందర్భంగా.సమస్త ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ వెలుగుల పండుగ శుభాకాంక్షలు.ఈ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగును నింపి, అపారమైన సంతోషం, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.

Read More

            ఆర్టిఏ చెక్పోస్టులో ఏసీబీ సోదాలు     ఎం వి ఐ కిరణ్ కుమార్ ను అదుపులో తీసుకున్న ఏసిపి అధికారులు పరివర్తన అవాజ్ సంగారెడ్డి,    సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర ఆర్టిఏ చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సోదాలు కొనసాగించారు. విధుల్లో ఉన్న ఎంవీఐ కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని లెక్కల్లో చూపని 43 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీ చార్టులు ఏర్పాటు చేసుకొని ఎంవీఐలు విధులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమంగా రూపొందించిన డ్యూటీ చార్టులను సీజ్ చేశారు. ఏసిబి అధికారులకు పట్టుబడిన ఎంవీఐ కిరణ్ కుమార్ తన డ్రైవర్ తో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సోదాల్లో వెలుగు చూసినట్లు…

Read More

 టపాకాయల గోదాంలో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం         సరైనా నిబంధనలు పాటించకపోవడం వల్లే అగ్నిప్రమాదం సంగారెడ్డి జిల్లా ఆందోల్శివారులోని కటుకం వేణుగోపాల్ & సన్స్ హోల్ సెల్ టపాకాయల గోదాం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.మరో రెండు రోజుల్లో దీపావళి పండగ ఉండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల,హైదరాబాద్ శివారు ప్రాంతాల నుండి అనేకమంది ఆందోల్ లోని కటకం వేణుగోపాల్ &సన్స్ టపకాయల గోదాం వద్దకు రావడంతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది.సాయంత్రం ఒక్కసారిగా గోదాం పక్కనే ఉన్న షాపు వద్ద మంటలు చెలరేగడం,టపకాయలు పెద్ద ఎత్తున ఉండటంతో క్షణాల్లో మంటలు పూర్తిగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.వెంటనే అంగీ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.హోల్ సెల్ టపాకాయల గోదాం నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఫైర్ సేఫ్టీ పాటించకపోవడంతో…

Read More

  సీసీఐ కొనుగోలు సెంటర్ లను సద్వినియోగం చేసుకోండి              రైతులు మద్దతు ధర పొందండి కలెక్టర్ రాహుల్ రాజ్ పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని.. మద్దతు ధర పొందాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.టేక్మాల్ మండలంలోని బర్దిపూర్ లో పత్తి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఈ సందర్బంగా కలెక్టర్మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 25939 మంది రైతులు 34903 ఎకరాల్లో పత్తి సాగు అయ్యిందని. అంచనా వేశారన్నారు.జిల్లా లో సిద్ధార్థ జిన్నింగ్ మిల్ పాపన్నపేట్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పత్తి ధరలు పింజరకం బీబీ మోడ్ 8110, గా పింజరకము బిబి స్పెషల్ 8060 గా, పింజరకము ఎం ఇ సి హెచ్ 8010 గా ఉన్నాయన్నారు ఇందుకు సంబందించి సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు పత్తి కొనుగోలు కేంద్రాలను మనటరింగ్ చేసేందుకు……

Read More

           బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే జనాభాలో56% ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా అగ్రకుల నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రం లో పార్టీలకతీతంగా అన్ని కుల సంఘ నాయకులు సంపూర్ణ బందుకు సహకరించారు. అనంతరం జాతీయ రహదారి 44 పై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్లు చెల్లవని తెలిసే అగ్రకుల నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసే ఏ పార్టీని కూడా వదిలి పెట్టే ప్రసక్తే లేదని, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరించారు.. తెలంగాణ రాష్ట్ర బంద్ ఎవరు పై పోరాటం చేస్తున్నట్లు?? అని మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది 42% శాతం రిజర్వేషన్ల కోసం BC సంఘాలు చేపట్టాయి…

Read More

           మేమెంతో మాకంత               మెదక్ పట్టణంలో 42 శాతం రిజర్వేషన్ల కొరకు బీసీ బంద్                                విజయవంతం     తెలంగాణ బీసీ జేఏసీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా బందులో భాగంగా మెదక్ పట్టణంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నుండే బస్ డిపో వద్ద బైటా ఈంచడంతో డిపో లకె పరిమితైన ఆర్టీసీ బస్సులు మెదక్ పట్టణంలో బీసీ బందుకు మద్దతుగా అన్ని షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత అనంతరం ఆ బిల్లును పార్లమెంటుకు పంపియాలని పార్లమెంట్ సమావేశాల్లో 9వ షెడ్యూల్లో పెట్టి బిసీ బిల్లును…

Read More