Author: parivarthanaawaaz
జూబ్లీహిల్స్‌లో పోరు ముదురుతోంది — ప్రజల మద్దతు బీఆర్ఎస్‌కేనని కేటీఆర్ వ్యాఖ్యలు (హైదరాబాద్, అక్టోబర్13 – ఆవాజ్ న్యూస్) జూబ్లీహిల్స్ రాజకీయ రంగంలో బీఆర్ఎస్ శక్తిని చూపించడానికి సిద్దమైందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రహమత్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతు, న్యాయం, ధర్మం అన్నీ బీఆర్ఎస్ వైపునే ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ప్రజలు రేవంత్ రెడ్డి రాజకీయాలు బాగా తెలుసుకొని గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన ప్రజలు కూడా ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీ చేస్తామని చెప్పి కేవలం కాగితం మీదే చూపించి మోసం చేశారని ఆరోపించారు. షేక్‌పేట కబరస్థాన్‌కు…
గండి సుభద్రమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు పరివర్తన ఆవాజ్ మహబూబాబాద్ అక్టోబర్ 13 .. డోర్నకల్ పట్టణంలో జరిగిన సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టివి విలేకరి, టియుడబ్ల్యూజే(ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లాకోశాధికారి గండి సీతారాంగౌడ్ తల్లి గండి సుభద్రమ్మ గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని, చిత్రపటం ఎదుట నివాళులర్పించిన టియుడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాంనారాయణ.., మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ఖమ్మం అద్యక్షుడు శ్రీనివాస్, జిల్లా సహాయకార్యదర్శి రావూరి ప్రశాంత్, కురవి మండల అధ్యక్షుడు గుంటి సురేష్ తదితరులు.
కామారెడ్డి లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల చర్య (ఆవాజ్ న్యూస్ 13అక్టోబర్ ) నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలకు జరిమానాలు విధించి, అక్కడికక్కడే నెంబర్ ప్లేట్ అమర్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపకూడదని పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని, రోడ్డు భద్రత అందరి బాధ్యత అని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
డిసిసి ఎన్నిక కోసం దరఖాస్తుల ఆహ్వానం మెదక్ జిల్లా కేంద్రంలోని వినాయక గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఉత్తరకాండ్ మహిళా అధ్యక్షులు ఏఐసిసి అబ్జర్వర్, జ్యోతి రౌతుల. స్టేట్ అబ్జర్వర్ అన్సారిలు .సంగిశెట్టి జగదీష్, వరలక్ష్మి. ఆధ్వర్యంలో డిసిసి ఎన్నికల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఎవరైతే డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నార ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓ బి సి వారు ఎవరైనా దరఖాస్తుచేసుకోవచ్చు అని ఏఐసీసీ స్టేట్ అబ్జర్వర్ జ్యోతి రౌతుల కోరారు ప్రతి కాంసెన్సీ కార్యకర్తలతో సమావేశమై ఈనెల 22వ తారీకు వరకు అభిప్రాయాల సేకరణ చేసి వాటిని పరిశీలించి కార్యకర్తల అభిప్రాయాల అనుగుణంగానే డిసిసి అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఆమె అన్నారుఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు.–జిల్లా, మండల, బ్లాక్ కాంగ్రెస్స్థాయి నాయకులు, కార్యకర్తలు…
మా పాపను ఆదుకోండి అంటూ ఓ తల్లితండ్రుల వెడుకుంటున్నారు,దాతల కోసం ఎదురుచూపు పటాన్ చెరు పరివర్తన అవాజ్ అక్టోబర్ 11,ఆడుతూ పడుతూ చదువుకోవాల్సిన వయస్సులో ఆ బాలికను కిడ్నీ వ్యాధి పట్టి పీడిస్తోంది రెండు కిడ్నీలు పాడైపోయిన ఆ చిన్నారి తల్లితండ్రులు రెక్కల కష్టంతో బతుకుబండిని లాగిస్తున్నారు అయితే తమ కుమార్తె మంచానికే పరిమితం కావడం వారి ఆవేదన వర్ణనాతీతం గత రెండు సంవత్సరాలుగా తమకు ఉన్నదంతా కూతురు వైద్యానికే ఖర్చు పెట్టిన పలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బీరం గూడాకు చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది అయితే తరచుగా అనారోగ్యం పాలవుతుండడంతో వైద్యుల్ని సంప్రదించగా రెండు కిడ్నీలు పాడైనట్లు వెల్లడించారు ప్రస్తుతం బాలిక చికిత్స చేయిస్తున్నారు ఇప్పటివరకు బాలిక చికిత్సకోసం తల్లితండ్రులు 16 లక్షలవరకు ఖర్చు చేసినట్లు తెలిపారు ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు…
మనోహరాబాద్ ITC గోదాం చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ 18 లక్షల దొంగసొత్తు స్వాధీనం గత సెప్టెంబర్ నెలలో, మనోహరాబాద్ ITC గోదాం లో పది లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సుల దొంగతనం చేసిన కేసులో, ఈ రోజు మనోహరాబాద్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి , వారి నుండి చోరీ కి గురి కాబడిన మొత్తం పది లక్షల రూపాయల విలువైన సిగరెట్ బాక్సులను, రూ.8 లక్షల నగదును మరియు చోరీకి వాడిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మైదరబోయిన శ్రీకాంత్, చెట్టి మహేశ్ ఇద్దరు స్నేహితులు కొన్నిసంవత్సరాలుగా ఐ టి సి గోదాంలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు వారిద్దరూ దుర్విషనాలకు అలవాటు పడి వాహనాల ఫైనాన్సు బకాయిలు ఇంటి అప్పు తదితర కార్యాలయం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానితో వారు ఐటిసి…
దుర్గం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ అక్టోబర్ 11 , గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో స్థానికుల సమాచారం మేరకు దుర్గం చెరువులో ఒక వ్యక్తి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ ఉందని స్థానికులు తెలుపగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గమనించగా సుమారు 24ఏళ్ల నుండి 27 సంవత్సర వయస్సు కలిగి ఒంటిపై నీలిరంగు చెక్స్ షర్ట్ నలుపు రంగు ప్యాంట్ ధరించి ఎత్తు 5.5 అడుగులు ఉన్న మృతదేహం లభ్యమైందని మృతుడికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అయితే మృతుడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ఈ యొక్క మృతుడి సమాచారం తెలిసినట్లయితే. మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతూ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం…
ఫుట్ పాత్ వ్యాపారాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు శేరిలింగంపల్లి పరివర్తనఅవాజ్ అక్టోబర్ 11 ,ఫుట్ పాత్ ఎంకోరోజ్మెంట్ మరియు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతున్నా కారణంగా శనివారం నాడు మియాపూర్ డివిజన్ లోని జేపీ నగర్ నుండి హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ రోడ్డులో ఫుట్ పాత్ లపై ఇరువైపులా ఉన్న వ్యాపార దూఖానాలను మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు ప్రతిరోజూ ఫుట్ పాత్ లపై వెలిసిన దూఖానాలవల్ల వాటిముంది పార్కింగ్ చేసిన వాహనాలవల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని పాదచారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అంతేకాకుండా ఇకపై రోడ్డుకు ఇరువైపులా ఎవరుకూడా వ్యాపారాలు నిర్వహించరాదని సూచించారు ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
వివాహితపై అత్యాచారం చేసిన సంఘటన మెదక్ జిల్లాలో కలకలం లేపింది మెదక్ జిల్లా కొల్చారం వైపు నుండి ఏడుపాయల కుదారి మొదటి బ్రిడ్జి దాట గానే ఒక మహిళపై దారుణం చోటుకు చేసుకుంది. మహిళపై గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళా చనిపోయిందనుకుని ఆమె చీరతో చెట్టు కట్టేసి వెళ్లిపోయారు.తెల్లవారుజామున అటువైపు చూసిన వారు సమాచారం పోలీసులకు ఇవ్వడంతో మెదక్ మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ జార్జ్, కొల్చారం, పాపన్నపేట ఎస్సైలు అహ్మద్ మొయినుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ సందర్శించి క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. బాధిత మహిళనుమెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ దొరికిన ఆధారాల ప్రకారంబాధిత మహిళది మెదక్ మండలం చిట్యాల తండాకు చెందిన మహిళలతెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసిందనిడిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు
డయల్ 100 ఫోన్చేయడంతో ప్రాణాలను కాపాడిన హోంగార్డ్ పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 11, హవేలీ ఘనపూర్ మండలం లింగ్సన్ పల్లి గ్రామం జ్యోతి అనే మహిళ తన ఇంటిలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని గ్రామస్థులు డయల్ 100 సమాచారం రావడం జరిగింది. తక్షణమే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకున్న హోం గార్డ్ వరప్రసాద్ (లడ్డు), జైయనంద్, రమేష్ లు గడ్డపార సహాయంతో తలుపులు పగులగొట్టారు. మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే స్పందించిన వరప్రసాద్ మహిళకు సిపిఆర్ చేసి స్పృహలో వచ్చిన వెంట నేమెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ నరేష్ కూడా ఆసుపత్రికి వెళ్లి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మహిళ ప్రాణాలను కాపాడినందుకు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు వరప్రసాద్, జైయనంద్, రమేష్ను అభినందించారు
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.