Author: parivarthanaawaaz

అమరవీరుల స్మరణలో విద్యార్థులకు వ్యాసరచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు, • రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, మరియు విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు ఆహ్వానం.• అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) కార్యక్రమాలు ప్రారంభం.• పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో విద్యార్థులకు ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ.• పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 21-10-2025 నుండి 31-10-2025 వరకు వివిధ కార్యక్రమాలతో నిర్వహించడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్కామారెడ్డి జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేస్తూ ప్రజల భద్రతకు, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు విశేష సేవలు అందించారు. వారి త్యాగల ఫలితమే నేటి మన శాంతియుత భద్రతతో కూడిన సమాజం అని ఎస్‌పి తెలిపారు. వారి వీరోచిత త్యాగాలను స్మరించుకోవడంలో భాగంగా, తెలంగాణ…

Read More

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో (పరివర్తన ఆవాజ్ న్యూస్, అక్టోబర్14)  వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు.మంగళవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, వ్యవసాయ, సహకార, డీఆర్‌డీఏ, తూనికలు-కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖాధికారులు మరియు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉందని, అందులో సన్నరకం 2,02,862 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 35,315 మెట్రిక్ టన్నులు ఉంటాయని తెలిపారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు…

Read More

మైనర్ బాలికలకు పోక్సో చట్టం పై అవగాహన కల్పిస్తున్న భరోసా ఎస్సై సుచిత. పరివర్తన ఆవాజ్.  అక్టోబర్ 14  ;     మైనర్ బాలిక పై అత్యాచారం లైంగిక వేధింపులు వంటివి చేసినట్లయితే వారిపై పోక్సో చట్టం ద్వారా చర్య తీసుకోబడుతుందనీ, ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడినట్లయితే మూడు సంవత్సరాల నుండి జీవితకాలం శిక్ష విధించవచ్చని ఒక లక్ష వరకు జరిమానాను విధించబడుతుందని అన్నారు. భరోసా కేంద్రాలు మన తెలంగాణలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 33 జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక భరోసా సెంటర్ ఉంటుందని ఈ భరోసా సెంటర్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే ఆ బాధితులకు న్యాయం చేస్తామని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో హవేలీ ఘనపూర్ మండలంలోని ముత్తాయి కోట మద్దుల్వాయి గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరానికి హాజరైన భరోసా కేంద్రం ఎస్సై సుచిత గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో…

Read More

అత్యాచారం చేసిన కేసును చేదించిన పోలీసులు పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 14  ;    గత శనివారం కొల్చారం మండలం ఏడుపాయల మూడవ బ్రిడ్జి వద్ద గిరిజన మహిళ పైఅత్యాచారం జరిగిన సంఘటన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందిన సంఘటన తెలిసింది ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది నిందితుడి కోసం ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిందితుడి కోసం దర్యాప్తు వేగవంతం చేశారు మెదక్ పట్టణంలోని అన్ని సిసి టీవీ ఫుటేజ్ లను చూడగా మెదక్ ఓల్డ్ బస్టాండ్ సమీపంలోని ఒక వైన్ షాప్ వద్ద ఉన్న సీ.సీ.టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని మరణించిన మహిళతో మాట్లాడినట్టు అనంతరం వారిద్దరూ నడుచుకుంటూ వెళ్లినట్టు సిసి టీవీ ఫుటేజ్ లో చూడడంతో నిందితుడిని పట్టుకొని విచారించగా నిందితుడు మెగావత్ ఫకీరా నాయక్ పని ఇప్పిస్తానంటూ మహిళను ఏడుపాయల దేవస్థానం దారిలోని మూడవ…

Read More

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలి. పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 14  మహబూబాబాద్. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల సమస్యలను పరిష్కరించాల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్థాయిలో విద్యా సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆయన చెప్పారు — “గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమి విద్యార్థుల భవిష్యత్తును చీకటిలో నెడుతోంది. వసతి గృహాల్లో ఫ్యాన్లు లేక, కరెంటు స్విచ్‌బోర్డులు దెబ్బతిని ఉండటం వల్ల విద్యార్థులు తీవ్రమైన వేడిని తట్టుకోలేక రాత్రంతా నిద్రలేక అవస్థలు పడుతున్నారు. పాఠశాల తరగతి గదుల్లో కూడా ఫ్యాన్ సౌకర్యం లేక విద్యార్థులు చెమటలు…

Read More

తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి ఫైర్ పరివర్తన ఆవాజ్ దినపత్రిక Oct 14, 2025, తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి ఫైర్ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత వీ శ్రీనివాస్‌ గౌడ్‌, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్రంగా మండిపడ్డారు. మాగంటి సునీత తన భర్తను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటే దానిని డ్రామా, యాక్షన్ అనడం సరికాదని ఆయన మంగళవారం అన్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్లతో గెలిచి మంత్రి అయిన తుమ్మల, అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నికలో ఆయన భార్య, పిల్లలు ప్రచారం చేస్తే దానిని యాక్షన్ అనడం అమానుషమని గౌడ్‌ విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read More

కామారెడ్డిలో అమ్మ భగవాన్ ఆలయంలో భక్తి పూర్వక అన్నదాన కార్యక్రమం పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 14; కామారెడ్డి పట్టణంలోని అమ్మ భగవాన్ ఆలయంలో ఈరోజు భక్తి పూర్వకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు పాల్గొని భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా దీపం జ్యోతి పరంజ్యోతి అమ్మవారి భక్తులు మరియు ఎర్ర విజయ గుప్తా పాల్గొని సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో సత్సంగం నిర్వహించి, భగవాన్ తత్వంపై మంత్రోచ్చారణలు చేశారు. భక్తి వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Read More

కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 14 ; శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్ చందానగర్ ,భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన మంజూరైన 186 మంది లబ్ధిదారులకు ఒక కోటి ఎనభై ఆరు లక్షల ఇరవై ఒక వేల ఐదు వందల డెబ్భై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కుల రూపేణా అందచేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్బంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఈ రోజు 20 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని…

Read More

              కంటి పరీక్ష కోసం క్యూ లైన్ లో మాజీ ఎమ్మెల్యే పరివర్తన ఆవాజ్ న్యూస్ రిపోర్టర్ షేక్ గౌస్ బాషా ఖమ్మం13-10-2025,  స్థానిక ఇల్లందు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య  ఐదు సార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా గెలిచారు అయినా గాని సర్వసాధారణ జీవితం గడపటం ఆశ్చర్యార్థకం ఆర్టిసి బస్సులలో ప్రయాణం సైకిల్ మీద ప్రయా ణం సర్వసాధారణ జీవితం ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి విలాసవంతమైన జీవితం గడిపే ఈ రోజుల్లో సర్వసాధారణమైన జీవితం గడపటం నిజమైన నాయకుని లక్షణం ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ పాల్వంచ కంటి ఆస్పత్రిలో క్యూలో నిలబడి కంటి పరీక్షలు చేయించుకోవడానికి సైకిల్ మీద వచ్చిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారికిఅభినందనలు తెలియజేస్తున్న ఇల్లందు కొత్తగూడెం పాల్వంచ నియోజకవర్గ ప్రజలు

Read More

ముకుందాపురం ఎస్బీఐలో రూ. 20 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందజేత   సద్వినియోగం చేసుకోవాలని ఏజీఎం సత్యనారాయణ పిలుపు పరివర్తన అవాజ్ న్యూస్ ముకుందాపురం14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం,కట్టుగూడెం గ్రామానికి చెందిన ఎస్బిఐ వినియోగదారుని కుటుంబానికి ఎస్బీఐ బ్యాంక్ అండగా నిలబడింది. కేవలం రూ. 1000/- చెల్లించి తీసుకున్న పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ కింద, మృతుని నామినీకి రూ. 20 లక్షల చెక్కును అందజేశారు.వివరాల్లోకి వెళితే, కట్టుగూడెం గ్రామానికి చెందిన పరిటాల పుల్లయ్య  మూడు నెలల క్రితం పిడుగు పాటుకు గురై మరణించారు. ఆయన ఎస్బీఐ బ్యాంకులో రూ. 1000/-తో పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించుకోగా, భార్య పరిటాల లలితను నామినీగా నమోదు చేశారు. పుల్లయ్య మరణానంతరం, నామినీ లలిత ముకుందాపురం ఎస్బీఐ మేనేజర్ శివశంకర్ ని సంప్రదించారు. బ్యాంక్ సిబ్బంది వేగంగా స్పందించి, ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం పంపగా, నామినీకి రూ. 20,00,000/- చెక్కు మంజూరైంది.ముకుందాపురం…

Read More