తెలంగాణ పరివర్తన అవాజ్ న్యూస్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవెలప్మెంట్ రాజేంద్రనగర్ లో 2 రోజు ల జలసంవాద్ నీటి ప్రాముఖ్యత అనే అంశం పై శిక్షణ కార్యక్రమం విభవాని ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ రాజీవ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విభవాని ఇండియా, శ్రీ. ప్రదీప్ కుమార్ సింగ్ డైరెక్టర్ ఉన్నతి భారతి అభియాన్, డాక్టర్ రమేష్ డైరెక్టర్ ఎన్ ఐ ఆర్ డి ఇన్స్టిట్యూట్ మరియు హరిప్రసాద్ స్టేట్ కోఆర్డినేటర్ విభవాని ఇండియా. ఈ శిక్షణ లో భాగంగా నీటిని ఏ విధంగా ఒడిసి పట్టాలి, ప్రజల బాధ్యత, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల బాధ్యత అనే అంశాలు చర్చించి తీసుకోవాల్సిన చర్యలు జాగర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల నుండి స్వచ్ఛంద సంస్థలు, విద్య సంస్థలు, టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు నుండి 60 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
జలసంవాద్ నీటి ప్రాముఖ్యత అనే అంశం పై శిక్షణ కార్యక్రమం
Previous Articleరాయదుర్గంలో కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన
Related Posts
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
© 2026 Parivarthana Awaaz . Designed by Creativals.com.
