Friday, October 23, 2026
Home People సంతాయిపేట్ గ్రామంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన

సంతాయిపేట్ గ్రామంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన

0
7

📰 Generate e-Paper Clip

( పరివర్తన అవాజ్ ) కామారెడ్డి జిల్లా తాడ్వాయి అక్టోబర్ 23: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యెల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్‌ఎస్ నగర్ సర్కిల్ సీఐ వీరయ్య, తాడ్వాయి ఎస్‌ఐ వై. నరేష్, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 100 మంది గ్రామస్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మోసపూరిత ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు, సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత సేవలను వినియోగించుకోవాలని వివరించారు.అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, బాలలను పనిలో పెట్టకుండా వారి విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్థులు పోలీసుల సూచనలను పాటిస్తూ సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నివారణకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.