సంతాయిపేట్ గ్రామంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన
( పరివర్తన అవాజ్ ) కామారెడ్డి జిల్లా తాడ్వాయి అక్టోబర్ 23: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యెల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఎస్ నగర్ సర్కిల్ సీఐ వీరయ్య, తాడ్వాయి ఎస్ఐ వై. నరేష్, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 100 మంది గ్రామస్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ...