Monday, November 23, 2026
Home Politics –ఉద్యమకారుడు స్వర్గీయ అచ్చ విద్యాసాగర్ కు నివాళులర్పించిన :ఎంపీ రవిచంద్ర…

–ఉద్యమకారుడు స్వర్గీయ అచ్చ విద్యాసాగర్ కు నివాళులర్పించిన :ఎంపీ రవిచంద్ర…

0
3

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 22

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వాన జరిగిన మహోద్యమంలో చురుకైన పాత్ర పోషించిన అచ్చా విద్యాసాగర్ ఈనెల 18వతేదీన మృతి చెందారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం సాయంత్రం వరంగల్ లోని విద్యాసాగర్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.వరంగల్ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో విద్యాసాగర్ కీలక పాత్ర పోషించారని,ఆయన అకాల మృతితో తెలంగాణ ఒక నిఖార్సైన నాయకుడిని కోల్పోయిందన్నారు.పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను ఎంపీ వద్దిరాజు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.