Monday, November 23, 2026
Home Politics 15వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా.. వైఎస్సార్ పార్టీ అభ్యర్థిగా గుండుంపల్లి నాగరాజు నామినేషన్

15వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా.. వైఎస్సార్ పార్టీ అభ్యర్థిగా గుండుంపల్లి నాగరాజు నామినేషన్

0
14

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆశీస్సులతో, గ్రామ ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలోకి..

 

తుని మండలం ఎస్. అన్నవరం గ్రామ పంచాయతీలో 15వ వార్డు సభ్యుడిగా వైఎస్సార్ పార్టీ అభ్యర్థి గుండుంపల్లి నాగరాజు ఆదివారం మధ్యాహ్నం పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆశీస్సులతో పాటు గ్రామ ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులే తనకు బలమని పేర్కొంటూ ఎన్నికల బరిలో నిలిచారు. వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి అవసరాలకు అండగా నిలిచి, వార్డు అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవాభావంతో పనిచేయడమే తన ప్రధాన ధ్యేయమని నాగరాజు ఆకాంక్షించారు. 15వ వార్డు ప్రజల ఆశీస్సులతో విజయాన్ని సాధించి, వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాననే విశ్వాసంతో నామినేషన్ దాఖలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.