పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 22
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తదితర ప్రముఖులు అక్షింతలు వేసి నూతన వధూవరులు లోకేష్ పటేల్ -నిక్షిత రావులకు తమ ఆశీస్సులు అందజేశారు.మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్-వాణి దంపతుల ప్రథమ పుత్రుడు లోకేష్ పటేల్ పెళ్లి పొల్సాని ప్రకాష్ రావు-సరిత దంపతుల ఏకైక కూతురు నిక్షిత రావుతో ఈనెల 15వతేదీన శామీర్ పేటలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా వారి రిసెప్షన్ ఆదివారం రాత్రి వరంగల్ ఫోర్ట్ రోడ్డులో ఉన్న ఓల్డ్ వాల్ మార్ట్ మైదానంలో ఏర్పాటు చేశారు.ఈ విందుకు కేటీఆర్, రవిచంద్ర,వినోద్ కుమార్,పాడి కౌశిక్ రెడ్డి,సత్యవతి రాథోడ్,గండ్ర వెంకటరమణారెడ్డి తదితర ప్రముఖులు హాజరై అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.




