Monday, November 23, 2026
Home People —బాల్యవివాహాలు చేయడం, ప్రోత్సాహించడం నేరం-అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి….

—బాల్యవివాహాలు చేయడం, ప్రోత్సాహించడం నేరం-అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి….

0
4

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 21

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ శివ నగర్ లోని డాన్ బాస్కో నవజీవన్ వీధి బాలల వసతి గృహం లోని పిల్లలకు రగ్గులు, పాదరక్షలు ఉచితంగా కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ఉచితముగా అందించడం జరిగింది. అనంతరం డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ..ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలు, మగపిల్లలను సమానంగా చూడాలి బాలల హక్కులు మరియు లింగ సమానత్వంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలు, మగపిల్లలను చదివించాలని, చిన్నతనం లోనే బాల్య వివాహాలు చేయవద్దని, బడి మాన్పించి బాల కార్మికులుగా మార్చవద్దని అది చట్టరీత్యా నేరం అని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లాలి కానీ పని ప్రదేశాల్లో ఉండకూడదని, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు ఎలాంటి మాదకద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలని, ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, క్రమశిక్షణతో, నిరంతరం కష్టపడి చదివినప్పుడే ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ లక్ష్యాలను చేరుకోగలరని అన్నారు.,ఈ కార్యక్రమంలో డాన్ బాస్కో నవజీవన్ చైర్మన్ ఫాదర్ కోషి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి. దివ్య, ఫీల్డ్ కోఆర్డినేటర్ రాజు, శారద, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.