Friday, October 23, 2026
Home People కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలి: సీఐటీయూ

కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలి: సీఐటీయూ

0
5

📰 Generate e-Paper Clip

నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి..

-కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలి

-సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి, ప్రతినిధి అక్టోబర్ 22: కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల సాధన, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలనే డిమాండ్లతో ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న బహుళ రోజుల ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఐటీయూ నాయకులు ధర్నా వాల్ పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతతో పాటు సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంతో పాటు డీఏ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని అన్నారు.కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 25, 26 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అక్టోబర్ 25న పాల్గొనే కార్మిక, ఉద్యోగ సంఘాలు పారిశ్రామిక రంగ కార్మికులు, సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ధర్నాలో పాల్గొననున్నారు.అక్టోబర్ 26న పాల్గొనే కార్మిక, ఉద్యోగ సంఘాలు స్కీమ్ వర్కర్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, యూనివర్సిటీలు, వైద్య ఆరోగ్య రంగ ఉద్యోగులు, పెన్షనర్లు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్‌పోర్ట్, హమాలీ కార్మికులతో పాటు వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు పాల్గొననున్నారు.కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి కీలక డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నాలో కామారెడ్డి జిల్లా నుంచి కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రాజనర్సు, మహబూబ్, ఆయాజ్, ప్రభు, నర్సింగరావు, ప్రభాకర్, యాడారపు రాజు, సాయి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.