Friday, October 23, 2026
Home People రాందాస్ అగర్వాల్ జన్ సేవా సమ్మాన్‌కు డాక్టర్ బాలు ఎంపిక

రాందాస్ అగర్వాల్ జన్ సేవా సమ్మాన్‌కు డాక్టర్ బాలు ఎంపిక

0
6

📰 Generate e-Paper Clip

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చే ఢిల్లీలో అందుకోనున్న జాతీయ పురస్కారం

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి అక్టోబర్ 23 : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాందాస్ అగర్వాల్ జన్ సేవా సమ్మాన్ జాతీయ పురస్కారం 2026 కు ఎంపిక కావడం జరిగింది. ఈ అవార్డును ఈ నెల 31వ తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చే అందుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ పురస్కారానికి అవకాశం కల్పించిన ఐవిఎఫ్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్త,ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త,ఐవిఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ లకు,ఐవిఎఫ్ తెలంగాణ విభాగానికి,19 సంవత్సరాలుగా సహకరిస్తున్న రక్తదాతలకు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007లో రక్తదాన కార్యక్రమాలను కామారెడ్డి కేంద్రంగా ప్రారంభించి నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని, వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం,తల సేమియా బాధిత చిన్నారుల కోసం 6,000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించడం, 350 కి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 30 వేల యూనిట్ల రక్తాన్ని అందజేసినందుకు, రక్తదానం పైన అవగాహన కార్యక్రమాలు,సామాజిక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు గాను ఈ పురస్కారం అందుకోవడం జరిగిందని అన్నారు.ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో తల సేమియా బాధిత చిన్నారుల కోసం మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి వారి ప్రాణాలను కాపాడడం కోసం కృషి చేస్తానని అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.