Friday, October 23, 2026
Home People శ్రీ పెద్దమ్మ దేవి అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

శ్రీ పెద్దమ్మ దేవి అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

0
8

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పెద్దమ్మ దేవి అన్నప్రసాదం కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావాన్ని, సాంప్రదాయాలను పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఐక్యతను చాటుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్ సంఘ అధ్యక్షులు కాళ్ళ గంగరాజు, పున్న రాజేశ్వర్, ఉపాధ్యక్షలు చిట్యాల రమేష్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, నర్సింలు, శెంకర్, ఆశయ్య, రాజు, ముదిరాజ్ సంఘ సభ్యులు, భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.