శ్రీ పెద్దమ్మ దేవి అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పెద్దమ్మ దేవి అన్నప్రసాదం కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావాన్ని, సాంప్రదాయాలను పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఐక్యతను చాటుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్ సంఘ అధ్యక్షులు కాళ్ళ గంగరాజు, పున్న రాజేశ్వర్, ఉపాధ్యక్షలు చిట్యాల రమేష్,...