Friday, September 11, 2026
Home People జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చిన టీ జే ఎ..

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చిన టీ జే ఎ..

0
51

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి, సెప్టెంబర్ 1:– జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి, వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీ జే ఏ), ఎన్‌యూజే (ఐ) కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా DMAC చైర్మన్, మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించెందుకు వెళ్లగా, కలెక్టర్ సెలవు పై ఉన్నందున, జిల్లా రెవిన్యూ అధికారి పాండు నాయక్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా జిల్లా టీ జే ఎ అధ్యక్షుడు సడక్ సునీల్ మాట్లాడుతూ… జిల్లాలో వివిధ పత్రికలు, న్యూస్ ఛానళ్లు, డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని, జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. అర్హులైన జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య, సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల పిల్లల విద్యకు సంబంధించి విద్యా సహాయం, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాల్లో సహకారం అందించాలని కోరారు. జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో నిర్వహించే ప్రెస్‌మీట్లు, ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని జర్నలిస్టులకు సకాలంలో అందించాలని, విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పరిష్కార చర్యలు చేపట్టాలని, ప్రతి రెండు నెలలకు ఒకసారి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించి దరఖాస్తు చేసుకున్న అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలన్నారు. జర్నలిస్టుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని TJA, NUJ(I) జిల్లా కమిటీ కోరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ యూ జే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు వి. రాజేందరనాథ్, టీ జే ఎ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవర్ధన్, టీ జే ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ సీఐ. హెచ్, ఉపాధ్యక్షులు ఆమృత్ రావు, వర్కింగ్ సెక్రెటరీ మోహన్, శ్రీనివాస్ రావు, కార్యదర్శి నవీన్, కోశాధికారి సుందర్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క సిద్ది రాములు, టీ జే ఎ సభ్యులు ఫర్వేజ్, రేణుకుమార్, బిక్కనూర్ సాయులు, కమ్మరి నవీన్, కుమ్మరి ఎల్లన్న, రామ్మూర్తి, కడెం భైరయ్య, టీ. సాయులుతో పాటు పలువురు పాత్రకేయులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.