Tuesday, September 22, 2026
Home People జనహిత గణేష్ మండలిలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

జనహిత గణేష్ మండలిలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

0
3

📰 Generate e-Paper Clip

 పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా  : కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC)లో ఏర్పాటు చేసిన జనహిత గణేష్ మండలిలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కలెక్టర్ విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, రైతులు, ఉద్యోగులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లు కలెక్టర్ తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో TNGOs అధ్యక్షులు వెంకట్ రెడ్డి, TGO అధ్యక్షులు దేవేందర్, సెక్రటరీ సాయి రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.