జనహిత గణేష్ మండలిలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా  : కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC)లో ఏర్పాటు చేసిన జనహిత గణేష్ మండలిలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కలెక్టర్ విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, రైతులు, ఉద్యోగులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లు కలెక్టర్ తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుత...