Tuesday, September 22, 2026
Home People మట్టి గణపతుల నిర్వాహకులకు ఘన సత్కారం.. ఉత్తమ గణపతి మండపాలకు బహుమతుల ప్రదానం…కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన...

మట్టి గణపతుల నిర్వాహకులకు ఘన సత్కారం.. ఉత్తమ గణపతి మండపాలకు బహుమతుల ప్రదానం…కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకకు హాజరైన ఎమ్మెల్యే నాయిని,సీపీ శ్వేతా IPS…

0
2

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 22 హనుమకొండ.

హనుమకొండ: వరంగల్ మహానగర గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో ఉత్తమ మట్టి గణపతుల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్‌రెడ్డి ,పోలీస్‌ కమిషనర్‌ శ్వేత IPS గ..పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్ఠించిన మండపాల నిర్వాహకులను వారు అభినందించారు. ఉత్తమ మట్టి గణపతుల విభాగంలో మడికొండ కింగ్‌ స్టార్‌ యూత్‌ అసోసియేషన్‌కు మొదటి, వరంగల్‌ రాంకీ విలాస్‌ గజానన మండలికి రెండో బహుమతి అందజేశారు.ఈ సందర్భంగా రేపు నగరంలో నిర్వహించనున్న గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సమన్వయంతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మండపాల నిర్వాహకులు నిర్ణయించిన సమయానికి నిమజ్జనానికి బయలుదేరి, పోలీస్‌ శాఖ సూచించే మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. నిమజ్జన ప్రక్రియ సకాలంలో పూర్తయ్యేలా నిర్వాహకులు సహకరించాలని, భక్తులు, యువత క్రమశిక్షణ పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను విజయవంతంగా ముగించాలని సూచించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.