ఆళ్లపల్లి అవాజ్ న్యూస్ సెప్టెంబర్ 5,
ఆళ్లపల్లి మండలంలోని సందిబంధం గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించి, ఉపాధ్యాయులకు పూలు అందించి అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




