భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులుకోరం కనకయ్య పుట్టినరోజును పురస్కరించుకుని వేములవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ తాటి చుక్కమ్మ మరియు చల్లసముద్రం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాటి బిక్షం గారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు నరాటి కోటేశ్వరరావు గారు,మూతి లక్ష్మయ్య గారు , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాస బత్తిని వెంకటరమణ, మూతి బుచ్చయ్య,కుర్ర శ్రీనివాస్ , కావేటి వెంకన్న,పెరుమాళ్ళ సమ్మయ్య, సోలం యుగంధర్, మహంకాళి పవన్, కొరిపల్లి యశ్వంత్, మరియు వేములవాడ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేసి, కనకయ్య కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Home Uncategorized వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా MLA కోరం కనకయ్య జన్మదిన వేడుకలు విద్యార్థులకు నోట్...




