వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా MLA కోరం కనకయ్య జన్మదిన వేడుకలు విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నుల పంపిణీ!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులుకోరం కనకయ్య పుట్టినరోజును పురస్కరించుకుని వేములవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ తాటి చుక్కమ్మ మరియు చల్లసముద్రం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాటి బిక్షం గారు ప్రత్యేకంగా పాల్గొన్నారు....