Tuesday, September 22, 2026
Home People వరంగల్‌  లో నిమజ్జన ఏర్పాట్లు సర్వం సిద్ధం…

వరంగల్‌  లో నిమజ్జన ఏర్పాట్లు సర్వం సిద్ధం…

0
4

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్‌, సెప్టెంబర్‌ 22:

సెప్టెంబర్‌ 23న నిర్వహించనున్న గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో వరంగల్‌ జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, ఐఏఎస్‌ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎల్‌. కిషోర్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు.వినాయక నిమజ్జనానికి గుర్తించిన చెరువుల వద్ద చేపట్టిన ఏర్పాట్లను వరంగల్‌ ఆర్డీవో సుమ, ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ ఇక్బాల్‌, సంబంధిత శాఖల అధికారులతో కలిసి అదనపు కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ ఎల్‌. కిషోర్‌ కుమార్‌ సూచించారు.భక్తులు నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలని, పిల్లలు మరియు వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సహకరించాలని ఆయన పేర్కొన్నారు.నిమజ్జనం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 18004253424,9154252936 కి కాల్ చేసి సంప్రదించాలని పేర్కొన్నారు.ఈ పరిశీలనలో సంబధిత శాఖల అధికారులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.