వరంగల్ లో నిమజ్జన ఏర్పాట్లు సర్వం సిద్ధం…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, సెప్టెంబర్ 22: సెప్టెంబర్ 23న నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో వరంగల్ జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్ మంగళవారం పరిశీలించారు.వినాయక నిమజ్జనానికి గుర్తించిన చెరువుల వద్ద చేపట్టిన ఏర్పాట్లను వరంగల్ ఆర్డీవో సుమ, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు...