పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 22
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఆపన్నహస్తంగా నిలిచి ఇటీవలే ప్రమాదవశాత్తు మృతి చెందిన లింగాల కేదారి పుష్పలత దంపతుల కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం ప్రకటించిన నేపథ్యంలో, కేదారి కుమారులు లింగాల కేదారి పృథ్వీరాజ్, ఆకాష్‌రాజ్‌లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డిని మంగళవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తమ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి కి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం తమ కుటుంబానికి ఎంతో భరోసానిచ్చిందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కందికొండ బలరాం, సదానందం తదితరులు పాల్గొన్నారు.




