పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్22..
వరంగల్ జిల్లా/ వెంకట్రామ జంక్షన్
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జిల్లా, మండల, డివిజన్ స్థాయి పదవులకు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ఓబీసీ రాష్ట్ర నాయకులు, జిల్లా ఓబీసీ విభాగం ఇంచార్జులు జిల్లాపల్లి పరమేష్, బొమ్మగాని విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ సమక్షంలో పలువురు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఓబీసీ విభాగాన్ని జిల్లా, మండల, డివిజన్ స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు బొమ్మగాని విక్రమ్ గౌడ్, పగిళ్ల రాజు, తోట మురళి
ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్గొండ రమేష్, మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఓబీసీ పదవుల ఆశావహులు పాల్గొన్నారు…




