Tuesday, September 22, 2026
Home People గణనాధులకు ప్రత్యేక పూజలు చేసిన హన్మకొండ ఎమ్మెల్యే నాయిని..

గణనాధులకు ప్రత్యేక పూజలు చేసిన హన్మకొండ ఎమ్మెల్యే నాయిని..

0
7

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్  తెలుగు దిన పత్రిక సెప్టెంబర్   21

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి  సోమవారం సాయంత్రం కాజీపేటలోని 63వ, 62వ డివిజన్‌లతో పాటు 53వ డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాధులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో, అత్యంత శోభాయమానంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే నాయిని అన్నారు.ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని గణనాథుడిని ప్రార్థించారు..ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు ఎమ్మెల్యే నాయినికి ఘన స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.